పక్కా కమర్షియల్ మూవీ టీజర్ రివ్యూ
మంచి రోజులు వచ్చాయి ఇచ్చిన నెగెటివ్ రిజల్ట్ నుంచి మారుతి తొందరగానే బయటకొచ్చాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా గోపీచంద్ తో చేస్తున్న సినిమా పనులు మొదలుపెట్టాడు. పక్కా కమర్షియల్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. ‘ఎవరికి చూపిస్తున్నారు సార్ మీ విలనిజం.. మీరు ఇప్పుడు చేస్తున్నారు నేను ఎప్పుడో చూసి చేసి వదిలేసాను..’ అంటూ గోపీచంద్ చెప్పిన డైలాగ్ టీజర్ లో హైలెట్ […]
మంచి రోజులు వచ్చాయి ఇచ్చిన నెగెటివ్ రిజల్ట్ నుంచి మారుతి తొందరగానే బయటకొచ్చాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా గోపీచంద్ తో చేస్తున్న సినిమా పనులు మొదలుపెట్టాడు. పక్కా కమర్షియల్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు.
‘ఎవరికి చూపిస్తున్నారు సార్ మీ విలనిజం.. మీరు ఇప్పుడు చేస్తున్నారు నేను ఎప్పుడో చూసి చేసి వదిలేసాను..’ అంటూ గోపీచంద్ చెప్పిన డైలాగ్ టీజర్ లో హైలెట్ గా నిలిచింది. గోపీచంద్ క్యారెక్టర్ ను మారుతి మాస్, క్లాస్ టచ్ తో డిజైన్ చేశాడు. టీజర్ లోని ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. రాశిఖన్నా లుక్స్ కూడా బాగున్నాయి. జేక్స్ బిజాయ్ బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.
భలే భలే మగాడివోయ్, టాక్సీవాలా, ప్రతి రోజు పండగే లాంటి విజయాల తర్వాత జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై పక్కా కమర్షియల్ సినిమా వస్తుంది. ప్రతి రోజు పండగే సినిమా తర్వాత సత్యరాజ్ మరోసారి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారు.