మంగళం శ్రీనుగా సునీల్

పుష్ప సినిమా నుంచి మరో ఫస్ట్ లుక్ వచ్చేసింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి హీరో, హీరోయిన్, విలన్ పాత్రలకు సంబంధించిన లుక్స్ రిలీజ్ చేయగా.. తాజాగా మరో కీలక పాత్రధారి సునీల్ ఫస్ట్ లుక్ ను రివీల్ చేశారు. పుష్ప సినిమాలో మంగళం శ్రీనుగా కనిపించబోతున్నాడు సునీల్. పుష్ప పార్ట్-1 ది రైజ్ లో సునీల్ విలన్ అనే విషయం చాన్నాళ్లుగా గాసిప్స్ రూపంలో వినిపిస్తూనే ఉంది. సినిమాలో సునీల్ నెగెటివ్ షేడ్స్ లో కనిపించబోతున్నాడనే […]

Advertisement
Update:2021-11-07 06:15 IST

పుష్ప సినిమా నుంచి మరో ఫస్ట్ లుక్ వచ్చేసింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి హీరో, హీరోయిన్, విలన్ పాత్రలకు సంబంధించిన లుక్స్ రిలీజ్ చేయగా.. తాజాగా మరో కీలక పాత్రధారి సునీల్ ఫస్ట్ లుక్ ను రివీల్ చేశారు. పుష్ప సినిమాలో మంగళం శ్రీనుగా కనిపించబోతున్నాడు సునీల్.

పుష్ప పార్ట్-1 ది రైజ్ లో సునీల్ విలన్ అనే విషయం చాన్నాళ్లుగా గాసిప్స్ రూపంలో వినిపిస్తూనే ఉంది. సినిమాలో సునీల్ నెగెటివ్ షేడ్స్ లో కనిపించబోతున్నాడనే విషయం ఈ ఫస్ట్ లుక్ తో కన్ ఫర్మ్ అయింది. సినిమాలో సునీల్ పాత్ర సమ్ థింగ్ స్పెషల్ గా ఉంటుందని, అతడి కెరీర్ ను మలుపుతిప్పే సినిమా అవుతుందని కూడా రషెష్ చూసిన వాళ్లు చెబుతున్నారు.

నిజానికి సునీల్ కు నెగెటివ్ పాత్రలు కొత్త కాదు. డిస్కోరాజా, కలర్ ఫొటో లాంటి సినిమాల్లో ఇప్పటికే ఆ టైపు పాత్రలు పోషించాడు. కాకపోతే అనుకున్నంత గుర్తింపు అందుకోలేకపోయాడు. ఇప్పుడు బన్నీ సినిమాతో విలన్ గా ఎస్టాబ్లిష్ అవ్వాలనే తన చిరకాల కోరికను నెరవేర్చుకోబోతున్నాడు ఈ హీరో కమ్ కమెడియన్.

అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాను వచ్చేనెల 17న రిలీజ్ చేయబోతున్నారు. ఇది పార్ట్ -1 మాత్రమే. వచ్చే ఏడాది పార్ట్-2ను రిలీజ్ చేస్తారు. రావురమేష్, అజయ్ ఘోష్, అనసూయ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Tags:    
Advertisement

Similar News