కొత్త మూవీ ప్రకటించిన అనుష్క
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ అనుష్క షెట్టి పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమా అనౌన్స్ చేసింది యు.వి.క్రియేషన్స్. సాహో, రాధే శ్యామ్ లాంటి భారీ సినిమాలతో దేశవ్యాప్తంగా యు.వి.క్రియేషన్స్ కు అద్భుతమైన క్రేజ్ వచ్చింది. ఇప్పుడు ఈ సంస్థలో అనుష్క శెట్టి హ్యాట్రిక్ సినిమా చేయబోతున్నారు. ఇది అనుష్కకు 48వ సినిమా. ఇప్పటికే ఈ నిర్మాణ సంస్థలో రెండు సినిమాలు చేసింది అనుష్క. 2013లో ప్రభాస్ హీరోగా వచ్చిన మిర్చి.. 2018లో లేడీ ఓరియెంటెడ్ భాగమతి […]
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ అనుష్క షెట్టి పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమా అనౌన్స్ చేసింది యు.వి.క్రియేషన్స్. సాహో, రాధే శ్యామ్ లాంటి భారీ సినిమాలతో దేశవ్యాప్తంగా యు.వి.క్రియేషన్స్ కు అద్భుతమైన క్రేజ్ వచ్చింది. ఇప్పుడు ఈ సంస్థలో అనుష్క శెట్టి హ్యాట్రిక్ సినిమా చేయబోతున్నారు. ఇది అనుష్కకు 48వ సినిమా.
ఇప్పటికే ఈ నిర్మాణ సంస్థలో రెండు సినిమాలు చేసింది అనుష్క. 2013లో ప్రభాస్ హీరోగా వచ్చిన మిర్చి.. 2018లో లేడీ ఓరియెంటెడ్ భాగమతి సినిమాలను యు.వి.క్రియేషన్స్ నిర్మించారు. ఈ రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. భాగమతి సినిమా తెలుగుతో పాటు మిగిలిన భాషల్లోనూ ఒకేసారి విడుదలై అద్భుతమైన విజయం అందుకుంది. ఇందులో తనదైన నటనతో అందరినీ మెప్పించారు అనుష్క శెట్టి.
ఇప్పుడు మూడోసారి అనుష్క, యు.వి.క్రియేషన్స్ కలిసి సినిమా చేయబోతున్నారు. దర్శకుడు మహేష్ బాబు న్యూ ఏజ్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమాలో సరికొత్త లుక్ లో కనిపించబోతోంది బొమ్మాలి. ఇది కూడా పాన్ ఇండియా సినిమానే.