సంక్రాంతి బరిలో సీనియర్ హీరో

సంక్రాంతికి ఇప్పటికే గట్టి పోటీ ఉంది. ఆర్ఆర్ఆర్ రిలీజ్ ఫిక్స్ అయింది. జనవరి 7 నుంచి థియేటర్లలో హంగామా చేయబోతోంది. దీంతో చాలా సినిమాలు తప్పుకున్నాయి. స్వయంగా మహేష్ బాబు తను నటిస్తున్న సర్కారువారి పాట సినిమాను ఉగాదికి పోస్ట్ పోన్ చేసుకున్నాడు. భీమ్లానాయక్ వస్తాడా రాడో అనుమానం. రాధేశ్యామ్ మాత్రం తగ్గేదేలే అంటున్నాడు. ఇలాంటి టఫ్ కాంపిటిషన్ మధ్య పోటీకి దిగుతున్నాడు హీరో రాజశేఖర్. యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘శేఖర్’. […]

Advertisement
Update:2021-11-02 17:07 IST

సంక్రాంతికి ఇప్పటికే గట్టి పోటీ ఉంది. ఆర్ఆర్ఆర్ రిలీజ్ ఫిక్స్ అయింది. జనవరి 7 నుంచి థియేటర్లలో హంగామా చేయబోతోంది. దీంతో చాలా సినిమాలు తప్పుకున్నాయి. స్వయంగా మహేష్ బాబు తను నటిస్తున్న సర్కారువారి పాట సినిమాను ఉగాదికి పోస్ట్ పోన్ చేసుకున్నాడు. భీమ్లానాయక్ వస్తాడా రాడో అనుమానం. రాధేశ్యామ్ మాత్రం తగ్గేదేలే అంటున్నాడు. ఇలాంటి టఫ్ కాంపిటిషన్ మధ్య పోటీకి దిగుతున్నాడు హీరో రాజశేఖర్.

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘శేఖర్’. ‘మ్యాన్ విత్ ద స్కార్’ అనేది ఉపశీర్షిక. లలిత్ దర్శకత్వం వహిస్తున్నారు. లక్ష్య ప్రొడక్షన్స్, పెగాసస్ సినీ కార్ప్ పతాకాలపై ఎమ్.ఎల్.వి. సత్యనారాయణ, శివాని, శివాత్మిక, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఇప్పుడు సంక్రాంతి బరిలో నిలిచింది.

సెకెండ్ వేవ్ కారణంగా షూటింగ్ కు గ్యాప్ ఇచ్చారు. ఆ తర్వాత అరకులో షెడ్యూల్ మొదలుపెట్టి 75శాతం సినిమా పూర్తిచేశారు. ఆ తర్వాత హైదరాబాద్, శ్రీశైలంలో మరో 2 షెడ్యూల్స్ చేశారు. దీంతో టోటల్ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జోరుగా నడుస్తోంది.

ఈ సినిమాలో రాజశేఖర్, సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో రఫ్ గా కనిపించబోతున్నారు. మలయాళీ బ్యూటీ అను సితార హీరోయిన్ గా పరిచయమౌతోంది. జార్జ్ రెడ్డి ఫేమ్ ముస్కాన్ సెకెండ్ హీరోయిన్ గా నటిస్తోంది. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.

Tags:    
Advertisement

Similar News