వైన్ షాపుల ముందు క్యూలైన్లు వద్దు.. వాక్ఇన్ స్టోర్లు పెట్టండి: కేరళ హైకోర్టు

దేశవ్యాప్తంగా ఎక్కడైనా వైన్ షాపులముందు పెద్ద పెద్ద క్యూలైన్లు కనపడుతుంటాయి. కరోనా టైమ్ లో నిత్యావసరాల షాపుల కంటే, వైన్ షాపుల ముందే జనాలు బాగా కనిపించేవారు. ఫుట్ పాత్ లపై మందుబాబులు వేచి చూడకుండా, వారికోసం వాక్ఇన్ స్టోర్లు ఏర్పాటు చేయాలని కేరళ హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. అయితే ఈ సూచన మందుబాబులపై ప్రేమతో కాదు.. ఆయా ప్రాంతాల్లో రోడ్లపై నడచి వెళ్లే మహిళలు, చిన్నారుల గురించి కేరళ హైకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. నవంబర్ […]

Advertisement
Update:2021-10-22 02:54 IST

దేశవ్యాప్తంగా ఎక్కడైనా వైన్ షాపులముందు పెద్ద పెద్ద క్యూలైన్లు కనపడుతుంటాయి. కరోనా టైమ్ లో నిత్యావసరాల షాపుల కంటే, వైన్ షాపుల ముందే జనాలు బాగా కనిపించేవారు. ఫుట్ పాత్ లపై మందుబాబులు వేచి చూడకుండా, వారికోసం వాక్ఇన్ స్టోర్లు ఏర్పాటు చేయాలని కేరళ హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. అయితే ఈ సూచన మందుబాబులపై ప్రేమతో కాదు.. ఆయా ప్రాంతాల్లో రోడ్లపై నడచి వెళ్లే మహిళలు, చిన్నారుల గురించి కేరళ హైకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. నవంబర్ 9లోగా దీనికి సంబంధించిన కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది కేరళ హైకోర్టు.

2017లోనే దీనికి సంబంధించిన ఉత్తర్వులిచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇటీవల త్రిశూర్ లోని ఓ వ్యక్తి, కోర్టు ఆజ్ఞలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదంటూ పిటిషన్ వేశారు. దీంతో ఈ వ్యవహారంపై విచారణ జరిగింది. జస్టిస్ దేవన్ రామచంద్రన్ ఈ కేసు విచారణలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం వైన్ షాపులను ఏర్పాటు చేసే సమయంలో చుట్టుపక్కలవారినుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది. గుడులకు, బడులకు దూరంగా వైన్ షాపులు ఏర్పాటు చేయాలనే నిబంధనలు కూడా ఉన్నాయి. అలాంటి ప్రాంతాలను వెతుక్కుని షాపులు తెరిస్తే.. అక్కడ స్థానికులు జనావాసాల మధ్య వైన్ షాపులు ఎందుకంటూ ఆందోళనలకు దిగుతుంటారు. ఇలాంటి వాటన్నిటికీ పరిష్కారమే వాక్ఇన్ వైన్ షాపులని చెప్పింది కేరళ హైకోర్టు. మిగతా అన్ని షాపుల్లాగే షాపు లోపలికి వచ్చి నచ్చిన బాటిల్ కొనుక్కుని బిల్ చెల్లించి తిరిగి వెళ్లే విధంగా వైన్ షాపులను రూపొందించాలని కేరళ ప్రభుత్వానికి సూచించింది. మహిళలు, చిన్నారులు, స్థానికులకు అసౌకర్యం లేకుండా చేయాలంటే వాక్ఇన్ స్టోర్ల పద్దతి రావాలని చెప్పింది.

Tags:    
Advertisement

Similar News