ఎలక్ట్రిక్ విమానాలు రాబోతున్నాయి!

ప్రస్తుతం ప్రపంచంలో చమురు నిల్వలు తగ్గిపోతున్నాయి. అందుకే పెట్రోల్, డీజిల్ వాహనాల ట్రెండ్ తగ్గి ఇప్పుడు ఎలక్ట్రిక్ హవా నడుస్తోంది. అయితే ఈ ఎలక్ట్రిక్ ట్రెండ్ కేవలం బైక్స్, కార్స్ కు మాత్రమే కాదు. విమానాలకు కూడా అప్లై చేస్తోంది నాసా. బ్యాటరీతో నడిచే ఫ్లైట్ ను తయారుచేసే పనిలో పడింది. నాసా ఓ విన్నూత్నమైన ఐడియాపై పని చేస్తుంది. అమెరికాలోని జోబీ ఏవియేషన్​తో కలిసి ఎలక్ట్రిక్​ ఎయిర్​ ట్యాక్సీని పరీక్షించడం మొదలుపెట్టింది. ఈ ట్యాక్సీ బ్యాటరీల […]

Advertisement
Update:2021-09-05 08:03 IST

ప్రస్తుతం ప్రపంచంలో చమురు నిల్వలు తగ్గిపోతున్నాయి. అందుకే పెట్రోల్, డీజిల్ వాహనాల ట్రెండ్ తగ్గి ఇప్పుడు ఎలక్ట్రిక్ హవా నడుస్తోంది. అయితే ఈ ఎలక్ట్రిక్ ట్రెండ్ కేవలం బైక్స్, కార్స్ కు మాత్రమే కాదు. విమానాలకు కూడా అప్లై చేస్తోంది నాసా. బ్యాటరీతో నడిచే ఫ్లైట్ ను తయారుచేసే పనిలో పడింది.
నాసా ఓ విన్నూత్నమైన ఐడియాపై పని చేస్తుంది. అమెరికాలోని జోబీ ఏవియేషన్​తో కలిసి ఎలక్ట్రిక్​ ఎయిర్​ ట్యాక్సీని పరీక్షించడం మొదలుపెట్టింది. ఈ ట్యాక్సీ బ్యాటరీల సాయంతో గాలిలో ఎగిరే కారు లాంటిదన్నమాట.

నాసా తన ‘అడ్వాన్స్‌డ్ ఎయిర్ మొబిలిటీ’ క్యాంపెయిన్‌లో భాగంగా ఎలక్ట్రిక్​ వెర్టికల్​ టేకాఫ్​ ల్యాండింగ్​ (eVTOL) విమానం పరీక్ష నిర్వహిస్తోంది. ఈ ట్రయల్ సక్సెస్ అయితే సామాన్యులు కూడా ఈ ఎయిర్ ట్యాక్సీలను వాడుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే ఫ్యూచర్ లో eVTOL విమానాలు ట్యాక్సీలుగా మారతాయి. చుట్టుపక్కల ప్రాంతాలకు ఈ ఎయిర్ టాక్సీలను బుక్ చేసుకుని వెళ్లిపోవచ్చు.

అంతేకాదు ఇదే టెక్నాలజీని మరింతగా డెవలప్ చేసి ఫ్యూచర్ లో ఎలక్ట్రిక్ విమానాలు నడిపేందుకు కూడా పలు విదేశీ విమాన సంస్థలు ప్లాన్ చేస్తున్నాయి. 2027 నాటికి లండన్– ఆమ్‌స్టర్‌డ్యామ్ రూట్ లో ఎలక్ట్రిక్ విమానాలు నడుపుతామని ‘ఈజీ జెట్’ అనే సంస్థ గతంలోనే ప్రకటించింది.

Tags:    
Advertisement

Similar News