రూ.500కే జియో స్మార్ట్ ఫోన్.. ఫీచర్లు ఇవే..
ఉచిత డేటా, ఫీచర్ ఫోన్లతో.. అప్పట్లో హల్ చల్ చేసిన జియో.. తాజాగా మరో కొత్త ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసింది. ప్రపంచంలోనే అత్యంత చౌకైన స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయబోతోంది. దీని వివరాలేంటంటే.. స్మార్ట్‌ఫోన్ వాడకం పెరిగితే డేటా వాడకం కూడా విపరీతంగా పెరుగుతుంది. అందుకే దానికోసం జియో మాస్టర్ ప్లాన్ వేసింది. ప్రస్తుతం దేశంలో ఫీచర్ ఫోన్లు వాడుతున్న సుమారు 30 కోట్ల మందిని స్మార్ట్ ఫోన్ యూజర్లుగా మార్చేందుకు ఓ పథకాన్ని ప్రవేశపెట్టబోతోంది. రిలయన్స్ […]
ఉచిత డేటా, ఫీచర్ ఫోన్లతో.. అప్పట్లో హల్ చల్ చేసిన జియో.. తాజాగా మరో కొత్త ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసింది. ప్రపంచంలోనే అత్యంత చౌకైన స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయబోతోంది. దీని వివరాలేంటంటే..
స్మార్ట్‌ఫోన్ వాడకం పెరిగితే డేటా వాడకం కూడా విపరీతంగా పెరుగుతుంది. అందుకే దానికోసం జియో మాస్టర్ ప్లాన్ వేసింది. ప్రస్తుతం దేశంలో ఫీచర్ ఫోన్లు వాడుతున్న సుమారు 30 కోట్ల మందిని స్మార్ట్ ఫోన్ యూజర్లుగా మార్చేందుకు ఓ పథకాన్ని ప్రవేశపెట్టబోతోంది.
రిలయన్స్ జియో కంపెనీ.. ‘జియో నెక్స్ట్’ పేరిట చీపెస్ట్ 4జీ స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకురానుంది. దీనిధర 50 నుంచి 75 డాలర్లు అంటే రూ.3,500 నుంచి రూ.5,400 మధ్య ఉండబోతోంది. అయితే ఫోన్ కొనాలంటే మొత్తం ధర చెల్లించాల్సిన అవసరం లేదు. ఫోన్ ధరలో కేవలం పదిశాతం అంటే రూ.500 వరకూ సొమ్ము చెల్లించి హ్యాండ్‌సెట్‌ను సొంతం చేసుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని విడతల వారీగా చెల్లించొచ్చు. ఈ స్కీమ్ తో రాబోయే ఆరు నెలల్లో ఐదు కోట్ల హ్యాండ్ సెట్లు అమ్మడం ద్వారా ఏకంగా రూ. 10 వేల కోట్ల రూపాయల బిజినెస్ చేయాలని రిలయన్స్ జియో టార్గెట్ గా పెట్టుకుంది. రాబోయే వినాయక చవితి పండగ సందర్భంగా జియో నెక్ట్స్ మార్కెట్‌లోకి రానుంది.
ఫోన్ ఫీచర్లు ఇవే..
5.5 ఇంచ్ డిస్‌ప్లే
13 ఎంపీ రేర్ కెమెరా
8 ఎంపీ ఫ్రంట్ కెమెరా
2,500 ఎంఏహెచ్ బ్యాటరీ
క్వాల్‌కామ్ 215 చిప్‌సెట్
2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజీ