పుష్ప విలన్ కూడా వచ్చేశాడు

అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో హ్యాట్రిక్ మూవీగా వస్తోంది పుష్ప. ఈ సినిమాను 2 భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు. ఇందులో మొదటి భాగం పుష్ప: ది రైజ్ క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా క‌లిసి నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి మరో లుక్ బయటకొచ్చింది. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా జాతీయ అవార్డు గ్ర‌హిత, మ‌ళ‌యాలీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. భన్వర్ సింగ్ షెకావత్ IPSగా […]

Advertisement
Update:2021-08-28 10:51 IST

అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో హ్యాట్రిక్ మూవీగా వస్తోంది పుష్ప. ఈ సినిమాను 2 భాగాలుగా
తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు. ఇందులో మొదటి భాగం పుష్ప: ది రైజ్ క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది.
మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా క‌లిసి నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి మరో లుక్ బయటకొచ్చింది.

ఈ సినిమాలో ప్రతినాయకుడిగా జాతీయ అవార్డు గ్ర‌హిత, మ‌ళ‌యాలీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్న
సంగతి తెలిసిందే. భన్వర్ సింగ్ షెకావత్ IPSగా ఫ‌హాద్ ఫాజిల్ పుష్ప: ది రైజ్‌లో కనిపించబోతున్నారు.
తాజాగా ఈయన ఫస్ట్ లుక్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు.

ఇప్పటికే విడుదలైన ఈయన బర్త్ డే పోస్టర్‌లో EVIL WAS NEVER SO DANGEROUS అంటూ
రాసుకొచ్చారు. ఇప్పుడు విడుదలైన పోస్టర్ కూడా అలాగే ఉంది. దీన్ని బట్టి ఫహాద్ పాత్రను సుకుమార్ ఎలా డిజైన్ చేస్తున్నారో అర్థమవుతుంది. గుండుతో ఉన్న ఫహాద్ ఫాజిల్ లుక్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది.

ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ సింగిల్ దాక్కో దాక్కో మేకకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

Tags:    
Advertisement

Similar News