నాని తగ్గలేదు.. నితిన్ తగ్గాడు

ఈ సీజన్ లో ఓటీటీలోకి వస్తున్న క్రేజీ సినిమాలు రెండే. వాటిలో ఒకటి నాని నటించిన టక్ జగదీశ్ కాగా.. రెండోది నితిన్ నటించిన మాస్ట్రో సినిమా. టక్ జగదీష్ అమెజాన్ ప్రైమ్ లో, మాస్ట్రో సినిమా డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ లోకి రాబోతోంది. అయితే విడుదల తేదీల విషయంలో నితిన్ వెనక్కి తగ్గగా.. నాని మాత్రం తగ్గేది లేదంటున్నాడు. టక్ జగదీశ్ సినిమాను నేరుగా ఓటీటీకి ఇచ్చేసినప్పుడు ఎగ్జిబిటర్లు నానా హంగామా చేశారు. అటు […]

Advertisement
Update:2021-08-26 15:26 IST

ఈ సీజన్ లో ఓటీటీలోకి వస్తున్న క్రేజీ సినిమాలు రెండే. వాటిలో ఒకటి నాని నటించిన టక్ జగదీశ్ కాగా..
రెండోది నితిన్ నటించిన మాస్ట్రో సినిమా. టక్ జగదీష్ అమెజాన్ ప్రైమ్ లో, మాస్ట్రో సినిమా డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ లోకి రాబోతోంది. అయితే విడుదల తేదీల విషయంలో నితిన్ వెనక్కి తగ్గగా.. నాని మాత్రం తగ్గేది లేదంటున్నాడు.

టక్ జగదీశ్ సినిమాను నేరుగా ఓటీటీకి ఇచ్చేసినప్పుడు ఎగ్జిబిటర్లు నానా హంగామా చేశారు. అటు నిర్మాతలు కూడా కొంతమంది ఆగ్రహం వ్యక్తంచేశారు. థియేట్రికల్ రిలీజ్ అవుతున్న సినిమాలకు పోటీగా.. ఓటీటీలో అదే రోజున, అంటే సెప్టెంబర్ 10న టక్ జగదీశ్ ను రిలీజ్ చేయడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. అయితే నాని తగ్గలేదు. అదే తేదీకి స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉంది.

అయితే ఈ విషయంలో నితిన్ మాత్రం వెనక్కి తగ్గాడు. మాస్ట్రో సినిమాను సెప్టెంబర్ 9న స్ట్రీమింగ్ కు పెట్టాలని అనుకున్నారు. కానీ టక్ జగదీష్ పై జరిగిన రాద్దాంతం చూసిన తర్వాత నితిన్ వెనక్కి తగ్గాడు. తన సినిమాను 9న కాకుండా.. 17న విడుదల చేసేందుకు ప్లాన్ చేశాడు.

Tags:    
Advertisement

Similar News