సోడా సెంటర్ తెరిచే టైమ్ వచ్చింది

మార్కెట్లో కాస్త సందడి చేస్తున్న సినిమాల్లో శ్రీదేవి సోడా సెంటర్ ఒకటి. సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ సినిమాకు తాజాగా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాను ఆగస్ట్ 27న విడుదల చేయబోతున్నారు. న‌న్నుదోచుకుందువ‌టే, స‌మ్మోహ‌నం చిత్రాల‌తో యూత్ నే కాకుండా ఫ్యామిలి ఆడియ‌న్స్ కూడా ఆక‌ట్టుకున్నాడు సుధీర్ బాబు. క‌థ‌ల విష‌యంలో కంగారు లేకుండా ప్రేక్ష‌కుల అభిరుచి కి త‌గ్గ‌ట్టుగా చిత్రాలు చేస్తూ వెల్ టాలెంటెడ్ హీరోగా […]

Advertisement
Update:2021-08-12 13:38 IST

మార్కెట్లో కాస్త సందడి చేస్తున్న సినిమాల్లో శ్రీదేవి సోడా సెంటర్ ఒకటి. సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ
సినిమాకు తాజాగా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాను ఆగస్ట్ 27న విడుదల చేయబోతున్నారు.

న‌న్నుదోచుకుందువ‌టే, స‌మ్మోహ‌నం చిత్రాల‌తో యూత్ నే కాకుండా ఫ్యామిలి ఆడియ‌న్స్ కూడా
ఆక‌ట్టుకున్నాడు సుధీర్ బాబు. క‌థ‌ల విష‌యంలో కంగారు లేకుండా ప్రేక్ష‌కుల అభిరుచి కి త‌గ్గ‌ట్టుగా చిత్రాలు చేస్తూ వెల్ టాలెంటెడ్ హీరోగా సుధీర్‌బాబు త‌న కెరీర్ ని కొన‌సాగిస్తున్నారు. అదే విధంగా ప్ర‌స్తుతం ఆయ‌న చేస్తున్న చిత్రం శ్రీదేవి సోడా సెంట‌ర్‌. ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ చేసిన ద‌గ్గ‌ర‌నుండే ట్రెండ్ లో క్రేజ్ స్టార్ట‌య్యింది. విడుద‌లైన ఫస్ట్ లుక్ కి, ఆ త‌రువాత విడుద‌లైన గ్లిమ్స్ కి విప‌రీత‌మైన క్రేజ్ వచ్చింది.

ఈ చిత్రాన్ని భ‌లేమంచిరోజు, ఆనందో బ్ర‌హ్మ‌, యాత్ర లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హ్య‌ట్రిక్ చిత్రాలు అందించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ 70 ఎంఎం ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్ లో నిర్మాత‌లు విజ‌య్ చిల్లా, శ‌శి దేవిరెడ్డి లు
సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి 1978 ప‌లాస చిత్రం ద్వారా బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవిని ట్రెండింగ్ సాంగ్ ని టాలీవుడ్ కి అందించిన క‌రుణ‌కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. జీ గ్రూప్ ఈ సినిమా టోటల్ సౌత్ రైట్స్ దక్కించుకుంది.

Tags:    
Advertisement

Similar News