ఆ హీరోయిన్ ఎందుకు బరువు పెరిగింది?

హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ కాస్త బొద్దుగానే ఉంటుంది. మొదటి సినిమా టాక్సీవాలాలోనే ఆమె బొద్దుగా కనిపించింది. ఆ తర్వాత ఇంకాస్త లావెక్కింది. రీసెంట్ గా రిలీజైన తిమ్మరుసు సినిమాలో ఇంకాస్త లావుగా కనిపించిందంటూ ఆమెపై విమర్శలు చెలరేగాయి. తన ఫిజిక్ పై వస్తున్న కామెంట్స్ పై ప్రియాంక జవాల్కర్ స్పందించింది. తను ఎందుకు లావెక్కిందో చెప్పుకొచ్చింది. “నాకు ఆరోగ్య సమస్య ఉంది. థైరాయిడ్ తో బాధపడుతున్నాను. ఆ విషయాన్ని తెలుసుకునే సమయానికే థైరాయిడ్ వల్ల నేను లావయ్యాను. ఆ […]

Advertisement
Update:2021-08-11 12:20 IST

హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ కాస్త బొద్దుగానే ఉంటుంది. మొదటి సినిమా టాక్సీవాలాలోనే ఆమె బొద్దుగా
కనిపించింది. ఆ తర్వాత ఇంకాస్త లావెక్కింది. రీసెంట్ గా రిలీజైన తిమ్మరుసు సినిమాలో ఇంకాస్త లావుగా
కనిపించిందంటూ ఆమెపై విమర్శలు చెలరేగాయి. తన ఫిజిక్ పై వస్తున్న కామెంట్స్ పై ప్రియాంక జవాల్కర్ స్పందించింది. తను ఎందుకు లావెక్కిందో చెప్పుకొచ్చింది.

“నాకు ఆరోగ్య సమస్య ఉంది. థైరాయిడ్ తో బాధపడుతున్నాను. ఆ విషయాన్ని తెలుసుకునే సమయానికే
థైరాయిడ్ వల్ల నేను లావయ్యాను. ఆ తర్వాత వైద్యుల సూచనల మేరకు మందులు తీసుకుంటూ, మంచి
ఆహారం తీసుకుంటూ, వ్యాయామం చేసుకుంటూ ప్రస్తుతం స్లిమ్ గా తయారయ్యాను.”

ఇలా తను బొద్దుగా మారడం వెనక రీజన్ ను బయటపెట్టింది ప్రియాంక జవాల్కర్. ప్రస్తుతం స్లిమ్ గా ఉన్న ఈ బ్యూటీ.. ఇదే ఫిజిక్ ను ఇకపై కొనసాగిస్తానని చెబుతోంది. తిమ్మరుసు, ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాల్ని బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. త్వరలోనే గమనం అనే మరో సినిమాతో కూడా కనువిందు చేస్తానంటోంది.

Tags:    
Advertisement

Similar News