పుష్ప విలన్ లుక్ కూడా వచ్చేసింది

అల వైకుంఠ‌పురములో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత అల్లు అర్జున్ హీరోగా.. రంగస్థ‌లం‌ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. ఆర్య‌, ఆర్య‌ 2 సినిమాల తర్వాత హ్యాట్రిక్ చిత్రంగా పుష్ప వస్తుంది. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు విడుదలైన ప్రతీ అప్‌డేట్ కూడా సోషల్ మీడియాలో సంచలనం రేపింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, మొన్నటికి మొన్న విడుదలైన తొలి పాటకు సంబంధించిన టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ సినిమాలో […]

Advertisement
Update:2021-08-09 13:24 IST

అల వైకుంఠ‌పురములో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత అల్లు అర్జున్ హీరోగా.. రంగస్థ‌లం‌ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. ఆర్య‌, ఆర్య‌ 2 సినిమాల తర్వాత హ్యాట్రిక్ చిత్రంగా పుష్ప వస్తుంది. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు విడుదలైన ప్రతీ అప్‌డేట్ కూడా సోషల్ మీడియాలో సంచలనం రేపింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, మొన్నటికి మొన్న విడుదలైన తొలి పాటకు సంబంధించిన టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.

ఈ సినిమాలో ప్రతినాయకుడిగా జాతీయ అవార్డు గ్ర‌హిత, మ‌ళ‌యాలీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్న
సంగతి తెలిసిందే. ఫ‌హాద్ న‌టించిన ప‌లు మ‌ళ‌యాలీ చిత్రాలు తెలుగుతో పాటు పాన్ ఇండియా వైడ్ సినీ
అభిమానుల ఆద‌ర‌ణ దక్కించుకున్నాయి. పుష్ప సినిమా నుంచి ఆయన లుక్ ను చూచాయగా విడుదల
చేశారు.

EVIL WAS NEVER SO DANGEROUS అంటూ పోస్టర్‌పై రాసుకొచ్చారు. దీన్ని బట్టి ఫహాద్ పాత్రను
సుకుమార్ ఎలా డిజైన్ చేస్తున్నారో అర్థమవుతుంది. ఫహాద్ ఫాజిల్ కన్ను హైలైట్ చేస్తున్న ఈ పోస్టర్‌కు
అద్భుతమైన స్పందన వస్తుంది. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. క్రిస్మస్ సందర్భంగా పుష్ప పార్ట్-1 ది రైజ్ విడుదల కానుంది.

Tags:    
Advertisement

Similar News