ఆర్ఆర్ఆర్ మేకింగ్ వీడియో అదుర్స్
ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ హంగామా మొదలైంది. ఈ సినిమాకు సంబంధించి ఈరోజు నుంచి అధికారిక ప్రచారం మొదలైంది. ఆర్ఆర్ఆర్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. కేవలం రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళికి మాత్రమే పరిమితమౌతుందనుకున్న ఈ వీడియోలో టోటల్ యూనిట్ కు చోటిచ్చారు. హీరోలతో పాటు, హీరోయిన్లు, విలన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు అంతా దర్శనమిచ్చారు. వీళ్లతో పాటు కీలకమైన టెక్నీషియన్స్ అంతా కనిపించారు. మేకింగ్ చూస్తే, ఆర్ఆర్ఆర్ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కిన విషయం అర్థమౌతూనే ఉంది. […]
ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ హంగామా మొదలైంది. ఈ సినిమాకు సంబంధించి ఈరోజు
నుంచి అధికారిక ప్రచారం మొదలైంది. ఆర్ఆర్ఆర్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. కేవలం రామ్
చరణ్, ఎన్టీఆర్, రాజమౌళికి మాత్రమే పరిమితమౌతుందనుకున్న ఈ వీడియోలో టోటల్ యూనిట్ కు
చోటిచ్చారు. హీరోలతో పాటు, హీరోయిన్లు, విలన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు అంతా దర్శనమిచ్చారు. వీళ్లతో
పాటు కీలకమైన టెక్నీషియన్స్ అంతా కనిపించారు.
మేకింగ్ చూస్తే, ఆర్ఆర్ఆర్ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కిన విషయం అర్థమౌతూనే ఉంది. ఆ విషయాన్ని
చెప్పడం కోసమే మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. దీనికితోడు రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదని
చెప్పడం కూడా మేకర్స్ ఉద్దేశం.
ఈ సినిమాకు సంబంధించి ఇంకా 2 పాటలు పెండింగ్ లో ఉన్నాయి. వాటిలో ఒక పాట షూటింగ్ కోసం
యూనిట్ త్వరలోనే యూరోప్ వెళ్లబోతోంది. భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన పాటగా దీన్ని
రూపొందించబోతున్నారు. మరోవైపు ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సాగుతున్నాయి. అక్టోబర్
13న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది ఆర్ఆర్ఆర్ మూవీ.