ఈసారి తగ్గేది లేదంటున్న పుష్పరాజ్

కరోనా నుంచి కోలుకున్న తర్వాత రెట్టించిన ఉత్సాహంతో రెడీ అయ్యాడు అల్లు అర్జున్. ఈసారి తగ్గేది లేదంటున్నాడు. మధ్యలో ఆగిపోయిన పుష్ప సినిమాను వేగంగా పూర్తిచేయబోతున్నాడు. ఈ మేరకు యూనిట్ కు కాల్షీట్లు కేటాయించాడు బన్నీ. వచ్చే వారం నుంచి పుష్ప కొత్త షెడ్యూల్ మొదలవుతుంది. దీని కోసం హైదరాబాద్ లో సెట్ వర్క్ రెడీ అవుతోంది. ఓ చిన్న అడవి సెట్ వేస్తున్నారు. దీంతో పాటు లారీలు నిలిపే ప్రదేశాన్ని తలపించేలా మరో సెట్ వేస్తున్నారు. […]

Advertisement
Update:2021-07-04 13:14 IST

కరోనా నుంచి కోలుకున్న తర్వాత రెట్టించిన ఉత్సాహంతో రెడీ అయ్యాడు అల్లు అర్జున్. ఈసారి తగ్గేది లేదంటున్నాడు. మధ్యలో ఆగిపోయిన పుష్ప సినిమాను వేగంగా పూర్తిచేయబోతున్నాడు. ఈ మేరకు యూనిట్ కు కాల్షీట్లు కేటాయించాడు బన్నీ.

వచ్చే వారం నుంచి పుష్ప కొత్త షెడ్యూల్ మొదలవుతుంది. దీని కోసం హైదరాబాద్ లో సెట్ వర్క్ రెడీ అవుతోంది. ఓ చిన్న అడవి సెట్ వేస్తున్నారు. దీంతో పాటు లారీలు నిలిపే ప్రదేశాన్ని తలపించేలా మరో సెట్ వేస్తున్నారు. ఈ రెండు సెట్స్ లో పుష్ప షూటింగ్ స్టార్ట్ అవుతుంది.

కరోనాతో షూటింగ్స్ అన్నీ నిలిచిపోయినా, బన్నీ మాత్రం ధైర్యంగా షూటింగ్ చేశాడు. లాక్ డౌన్ పడ్డానికి కొన్ని రోజుల ముందు వరకు ఈ సినిమా షూట్ నడిచింది. సరిగ్గా అదే టైమ్ లో బన్నీకి కరోనా సోకడంతో సినిమా షూటింగ్ ఆపేశారు. అలా ఆగిపోయిన సినిమాను వచ్చే వారం నుంచి తిరిగి షూట్ మోడ్ లోకి తీసుకురాబోతున్నారు.

Tags:    
Advertisement

Similar News