చరణ్-శంకర్ సినిమాపై పూర్తి క్లారిటీ

రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మాతగా రావాల్సిన సినిమాపై చాలా అనుమానాలున్న సంగతి తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ సంస్థ శంకర్ పై కేసు కూడా వేసింది. ఇప్పుడీ లీగల్ ట్రబుల్స్ ను ఈ సినిమా అధిగమించినట్టు తెలిసింది. శంకర్-చరణ్ సినిమాకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అంతేకాదు.. శంకర్ కు అటు రామ్ చరణ్ నుంచి కూడా హామీ లభించింది. రీసెంట్ గా శంకర్-రామ్ చరణ్ వీడియో కాల్ లో మాట్లాడుకున్నారు. ఈ […]

Advertisement
Update:2021-07-03 13:11 IST

రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మాతగా రావాల్సిన సినిమాపై చాలా అనుమానాలున్న
సంగతి తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ సంస్థ శంకర్ పై కేసు కూడా వేసింది. ఇప్పుడీ లీగల్ ట్రబుల్స్ ను ఈ
సినిమా అధిగమించినట్టు తెలిసింది. శంకర్-చరణ్ సినిమాకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అంతేకాదు..
శంకర్ కు అటు రామ్ చరణ్ నుంచి కూడా హామీ లభించింది.

రీసెంట్ గా శంకర్-రామ్ చరణ్ వీడియో కాల్ లో మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా శంకర్ కు పూర్తి
సహాయ సహకారాలు అందిస్తానని రామ్ చరణ్ మాటిచ్చాడట. సెప్టెంబర్ నుంచి తను ఫ్రీ అయిపోతానని,
ఆ తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు షూటింగ్ పెట్టుకోవచ్చని క్లియర్ గా చెప్పేశాడట చరణ్.
అంతేకాదు, ఈ క్షణం నుంచి ప్రీ-ప్రొడక్షన్ పనులు, నటీనటుల ఎంపిక లాంటివి కూడా చేసుకోమని
చెప్పేశాడట.

చరణ్ నుంచి పూర్తిగా గ్రీన్ సిగ్నల్ రావడం, కోర్టుల నుంచి కూడా లైన్ క్లియర్ అవ్వడంతో వచ్చే నెల
నుంచి ఈ సినిమాకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టాలని శంకర్ భావిస్తున్నాడట.
ఇందులో భాగంగా మ్యూజిక్ డైరక్టర్ అనిరుధ్ తో మ్యూజిక్ సిట్టింగ్స్ పెట్టాలని అనుకుంటున్నారట.

Tags:    
Advertisement

Similar News