మోదీతో కేజ్రీవాల్ ఆక్సిజన్ వార్..

“ఢిల్లీ ప్రభుత్వం చేసిన అతి వల్లే ఇతర రాష్ట్రాలకు సరిపడా ఆక్సిజన్ సరఫరా చేయలేకపోయాం, పరోక్షంగా ఆయా రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరతతో సంభవించిన మరణాలకు ఢిల్లీ ప్రభుత్వమే కారణం.” కేంద్రం తాజాగా చేస్తున్న ఆరోపణలివి. సుప్రీంకోర్టు నియమించిన ఆడిట్ కమిటీ నివేదికలో ఢిల్లీ ప్రభుత్వం అవసరానికి మించి ఆక్సిజన్ డిమాండ్ చేసిందనే విషయం ఉందని కేంద్రంలోని పెద్దలు కేజ్రీవాల్ పై మండిపడ్డారు. అవసరం లేకపోయినా హడావిడి చేసిన కేజ్రీవాల్ సర్కారు, ఇతర రాష్ట్రాలకు ముప్పు తెచ్చిపెట్టిందని తీవ్రంగా […]

Advertisement
Update:2021-06-26 02:40 IST

“ఢిల్లీ ప్రభుత్వం చేసిన అతి వల్లే ఇతర రాష్ట్రాలకు సరిపడా ఆక్సిజన్ సరఫరా చేయలేకపోయాం, పరోక్షంగా ఆయా రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరతతో సంభవించిన మరణాలకు ఢిల్లీ ప్రభుత్వమే కారణం.” కేంద్రం తాజాగా చేస్తున్న ఆరోపణలివి. సుప్రీంకోర్టు నియమించిన ఆడిట్ కమిటీ నివేదికలో ఢిల్లీ ప్రభుత్వం అవసరానికి మించి ఆక్సిజన్ డిమాండ్ చేసిందనే విషయం ఉందని కేంద్రంలోని పెద్దలు కేజ్రీవాల్ పై మండిపడ్డారు. అవసరం లేకపోయినా హడావిడి చేసిన కేజ్రీవాల్ సర్కారు, ఇతర రాష్ట్రాలకు ముప్పు తెచ్చిపెట్టిందని తీవ్రంగా విమర్శించారు. అయితే ఆ విమమర్శలను అదే స్థాయిలో తిప్పికొట్టారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. సుప్రీంకోర్టు ఆడిట్ కమిటీ నివేదిక పేరుతో బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని అన్నారు.

అసలేంటి ఆక్సిజన్ కథ..?
కరోనా రెండో దశ ఉధృతి కొనసాగుతున్న వేళ.. దేశవ్యాప్తంగా మెడికల్ ఆక్సిజన్ కి కరువొచ్చింది. ఇతర దేశాలనుంచి దిగుమతి చేసుకోవడంతోపాటు, దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి ఆస్పత్రులకు ఆక్సిజన్ తరలించడం కేంద్రానికి తలకు మించిన భారంగా మారింది. ఓ దశలో సుప్రీంకోర్టు సహా.. వివిధ రాష్ట్రాల హైకోర్టులు కేంద్రం తీరుని తప్పుబట్టాయి. ఆక్సిజన్ సరఫరాపై నిర్లక్ష్యాన్ని ప్రశ్నించాయి. ఏప్రిల్‌-మేలో చాలా ఆస్పత్రుల్లో ప్రాణవాయువు అందక కరోనా రోగులు చనిపోయిన సంఘటనలు జరిగాయి. ఢిల్లీకి ప్రాణవాయువు అందడంలేదనే ఆరోపణల నేపథ్యంలో హైకోర్టు జోక్యంతో కేంద్రం ఢిల్లీకి ఆక్సిజన్ కేటాయింపులు పెంచింది. అయితే సుప్రీంకోర్టు ఇటీవల ఆక్సిజన్ సరఫరా విషయంపై ఓ ఆడిట్ కమిటీని ఏర్పాటు చేసింది. రెండో దశ సమయంలో ఢిల్లీకి రోజుకి 289 మెట్రిక్‌ టన్నుల ప్రాణవాయువు అవసరం కాగా, కేజ్రీవాల్ సర్కారు మాత్రం 1140 మెట్రిక్‌ టన్నుల కోసం డిమాండ్‌ చేసినట్లు ఆ కమిటీ తన మధ్యంతర నివేదికలో పేర్కొందని తాజాగా కథనాలు వెలువడ్డాయి. ఢిల్లీకి ఆక్సిజన్ కేటాయింపులు పెంచడంకోసం ఇతర రాష్ట్రాలకు కోత విధించారని ఫలితంగా అక్కడ మరణాలు సంభవించాయని ఆ కమిటీ తెలిపినట్టు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే కమిటీ నివేదిక ఎక్కడా అధికారికంగా బయటకు రాలేదు. దీంతో బీజేపీ నేతలే తప్పుడు ప్రచారానికి దిగారంటూ కేజ్రీవాల్ మండిపడుతున్నారు.

“2 కోట్ల మంది ఢిల్లీ ప్రజల ప్రాణాలకోసం పోరాటం చేయడమే నేను చేసిన నేరమా? మీరంతా ఎన్నికల ప్రచారాల్లో తలమునకలై ఉన్నప్పుడు.. నేను రాత్రంతా నిద్రలేకుండా ప్రజలకు ఆక్సిజన్‌ అందించడంకోసం కృషిచేశాను, ప్రాణవాయువు కోసం పోరాడాను” అంటూ ట్విట్టర్ లో మండిపడ్డారు కేజ్రీవాల్. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన విషయాన్ని గుర్తు చేస్తూ ఎద్దేవా చేశారు. ఆడిట్ కమిటీ నివేదిక పేరుతో తమపై విమర్శలు చేసేందుకు బీజేపీ నేతలు కుట్రలు పన్నారని ఆరోపించారు.

Tags:    
Advertisement

Similar News