బడులు స్టార్ట్.. ఆన్లైన్లో మాత్రమే..!
కరోనా కారణంగా విద్యార్థులు పాఠశాలల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. విద్యార్థులు పాఠశాల వాతావరణాన్ని ఎంతో మిస్ అవుతున్నారు. కేవలం ఆన్లైన్లో మాత్రమే క్లాసులు జరుగుతుండటంతో.. ఏం నేర్చుకుంటున్నారో? ఏం వింటున్నారో? వాళ్లకే తెలియాలి. ఇక కరోనా బ్యాచ్ స్టూడెంట్స్ అంటూ సోషల్ మీడియాలో జోకులు కూడా పేలుతున్నాయి. ఎగువ మధ్యతరగతి, ధనిక వర్గాల పిల్లలకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంటాయి కాబట్టి.. ఆ వర్గాల్లో ఆసక్తి ఉన్న విద్యార్థులు ఎంతో కొంత నేర్చుకుంటారు. కానీ […]
కరోనా కారణంగా విద్యార్థులు పాఠశాలల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. విద్యార్థులు పాఠశాల వాతావరణాన్ని ఎంతో మిస్ అవుతున్నారు. కేవలం ఆన్లైన్లో మాత్రమే క్లాసులు జరుగుతుండటంతో.. ఏం నేర్చుకుంటున్నారో? ఏం వింటున్నారో? వాళ్లకే తెలియాలి. ఇక కరోనా బ్యాచ్ స్టూడెంట్స్ అంటూ సోషల్ మీడియాలో జోకులు కూడా పేలుతున్నాయి. ఎగువ మధ్యతరగతి, ధనిక వర్గాల పిల్లలకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంటాయి కాబట్టి.. ఆ వర్గాల్లో ఆసక్తి ఉన్న విద్యార్థులు ఎంతో కొంత నేర్చుకుంటారు. కానీ పేద విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది.
చాలా మందికి స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉండదు. కొన్ని గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం ఉండదు. మరికొన్ని ఊర్లకు విద్యుత్ సరఫరా సక్రమంగా ఉండదు. దీంతో పల్లెటూర్లలో విద్యార్థుల చదువు ముందుకు సాగడం లేదు.ఇక చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను తమతో పాటు వ్యవసాయపనులకు తీసుకెళ్తున్నారు. కొంతమంది కూలి పనులకు తీసుకెళ్తున్నారు. ఇలా సాగుతున్నాయి.. పల్లెటూర్లలో చదువులు.
ప్రస్తుతం ఏపీలో ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. జూన్ 12 నుంచి విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు చేపట్టాలంటూ రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) ఆదేశాలు జారీచేసింది. డీఈవోలకు, ఎంఈవోలకు ఆదేశాలు అందాయి. దూరదర్శన్, రేడియో, యూట్యూబ్, వాట్సాప్ ద్వారా క్లాసులు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశించింది. ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులతో సమన్వయం చేసుకుంటూ వారు ఏం వింటున్నారు? ఏం నేర్చుకుంటున్నారు? తదితర వివరాలను తెలుసుకోవాలని.. ప్రతి విద్యార్థి ఆన్లైన్లో క్లాసులు వినేలా ప్రోత్సహించాలని ప్రభుత్వం ఆదేశించింది.
కరోనా ఎఫెక్ట్‌తో జూన్ 30 వరకు వేసవి సెలవులను పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 1 నుంచి 10వ తరగతి వరకు సవివర అకడమిక్ క్యాలెండర్‌ను, కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ మాధ్యమాల ద్వారా పాఠాలు బోధించాలని సూచించింది.