మహేష్ మూవీ కోసం మరో హీరోయిన్
మహేష్ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై విడతల వారీగా పుకార్లు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో ముద్దుగుమ్మ వచ్చి చేరింది. ఆమె పేరు మాళవిక మోహనన్. మహేష్-త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్ గా మాళవిక మోహనన్ ను తీసుకున్నారనేది తాజా పుకారు. ఈ సినిమా కోసం ముందుగా పూజా హెగ్డే పేరు తెరపైకొచ్చింది. త్రివిక్రమ్ ఆస్థాన హీరోయిన్ కాబట్టి ఆమెనే అంతా ఫిక్స్ అయ్యారు. ఆ తర్వాత శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ పేరు తెరపైకొచ్చింది. […]
మహేష్ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై విడతల వారీగా పుకార్లు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడీ లిస్ట్
లోకి మరో ముద్దుగుమ్మ వచ్చి చేరింది. ఆమె పేరు మాళవిక మోహనన్. మహేష్-త్రివిక్రమ్ సినిమాలో
హీరోయిన్ గా మాళవిక మోహనన్ ను తీసుకున్నారనేది తాజా పుకారు.
ఈ సినిమా కోసం ముందుగా పూజా హెగ్డే పేరు తెరపైకొచ్చింది. త్రివిక్రమ్ ఆస్థాన హీరోయిన్ కాబట్టి ఆమెనే
అంతా ఫిక్స్ అయ్యారు. ఆ తర్వాత శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ పేరు తెరపైకొచ్చింది. ఇప్పుడు ఫ్రెష్ గా
మాళవిక మోహనన్ పేరు వినిపిస్తోంది. వీళ్ల ముగ్గుర్లో ఒకర్ని సెలక్ట్ చేస్తారా లేక కొన్ని రోజుల తర్వాత ఇంకో
పేరు తెరపైకొస్తుందా అనేది చూడాలి.
ప్రస్తుతం సర్కారువారి పాట సినిమా చేస్తున్నాడు మహేష్. ఆ మూవీ సెట్స్ పై ఉంటుండగానే త్రివిక్రమ్
సినిమా లాంఛ్ అవుతుంది. సర్కారువారి పాట కంప్లీట్ అయిన వెంటనే త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి
వెళ్తుంది.