త్వరలో విశాఖ నుంచి పాలన.. విజయసాయి కీలక వ్యాఖ్యలు..

మూడు రాజధానులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా.. కోర్టు కేసుల వల్ల రాజధాని తరలింపు వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఈ దశలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖ నుంచి త్వరలో పాలన ప్రారంభమవుతుందని, ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని అన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ముఖ్యమంత్రి ఎక్కడి నుంచైనా పాలన సాగించవచ్చని చెప్పిన ఆయన, సీఆర్డీఏ కేసుకు, రాజధాని తరలింపుకి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. పరిపాలన రాజధాని విశాఖ తరలించేందుకు త్వరలో […]

Advertisement
Update:2021-06-03 02:47 IST

మూడు రాజధానులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా.. కోర్టు కేసుల వల్ల రాజధాని తరలింపు వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఈ దశలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖ నుంచి త్వరలో పాలన ప్రారంభమవుతుందని, ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని అన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ముఖ్యమంత్రి ఎక్కడి నుంచైనా పాలన సాగించవచ్చని చెప్పిన ఆయన, సీఆర్డీఏ కేసుకు, రాజధాని తరలింపుకి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. పరిపాలన రాజధాని విశాఖ తరలించేందుకు త్వరలో ఏర్పాట్లు జరుగుతాయని వెల్లడించారు.

వైసీపీ రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా జగన్ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం ఇటీవల మరోసారి చర్చకు వచ్చింది. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా, కోర్టు కేసుల వల్ల రాజధాని తరలింపు ఆలస్యం అవుతోంది. ఈ సందర్భంలో విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. విశాఖనుంచే పాలన మొదలవుతుందని చెప్పినా, రాజధాని తరలించే తేదీ మాత్రం అడగవద్దని విజయసాయిరెడ్డి మీడియాను కోరారు.

ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖను మురికి వాడలరహిత నగరంగా తీర్చిదిద్దుతామని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. కైలాసగిరి-భోగాపురం మధ్య సిక్స్ లైన్ హైవే వస్తుందని చెప్పారు. జీవీఎంసీలోని 98 వార్డుల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు. ముడసర్లోన పార్కును మరింత అందంగా తీర్చిదిద్దుతామన్నారు. పంచగ్రామాల సమస్య కోర్టులో ఉందని, తీర్పు రాగానే పట్టాలిస్తామని అన్నారు. సింహాచలం భూముల చుట్టూ ప్రహారీ గోడ నిర్మిస్తామని, ఏలేరు-తాండవ రిజర్వాయర్‌ అనుసంధానానికి రూ.500 కోట్లు మంజూరు చేయబోతున్నామని చెప్పారు విజయసాయిరెడ్డి.

Tags:    
Advertisement

Similar News