నాగచైతన్యపై సమంత కామెంట్

రియల్ లైఫ్ భార్యాభర్తలు సమంత-నాగచైతన్య మధ్య గిల్లికజ్జాల గురించి అందరికీ తెలిసిందే. తమ ఇంట్లో జరిగే చాలా సన్నివేశాల్ని ఈ దంపతులు ఇప్పటికే బయటపెట్టారు. ఇప్పుడు తాజాగా సమంత మరో విషయాన్ని బయటపెట్టింది. నాగచైతన్యతో వైవాహిక జీవితానికి సంబంధించి మరో సీక్రెట్ ఇది. నాగచైతన్య-సమంత ఎప్పటికప్పుడు గొడవలు పడుతూనే ఉంటారట. అయితే ఇవన్నీ చిన్న చిన్న గొడవలే అంటోంది సమంత. అలా గొడవ పడిన ప్రతిసారి తనే ముందుగా సర్దుకుపోతానని.. వెళ్లి నాగచైతన్యతో కలిసిపోతానని చెబుతోంది సమంత. […]

Advertisement
Update:2021-06-02 14:38 IST

రియల్ లైఫ్ భార్యాభర్తలు సమంత-నాగచైతన్య మధ్య గిల్లికజ్జాల గురించి అందరికీ తెలిసిందే. తమ
ఇంట్లో జరిగే చాలా సన్నివేశాల్ని ఈ దంపతులు ఇప్పటికే బయటపెట్టారు. ఇప్పుడు తాజాగా సమంత
మరో విషయాన్ని బయటపెట్టింది. నాగచైతన్యతో వైవాహిక జీవితానికి సంబంధించి మరో సీక్రెట్ ఇది.

నాగచైతన్య-సమంత ఎప్పటికప్పుడు గొడవలు పడుతూనే ఉంటారట. అయితే ఇవన్నీ చిన్న చిన్న
గొడవలే అంటోంది సమంత. అలా గొడవ పడిన ప్రతిసారి తనే ముందుగా సర్దుకుపోతానని.. వెళ్లి
నాగచైతన్యతో కలిసిపోతానని చెబుతోంది సమంత.

ఎన్నో సినిమాల్లో “నేను అలిగాను.. బుంగమూతి పెట్టానంటూ” హొయలొలికించిన సమంతకు..
నిజజీవితంలో మాత్రం ఆ ఛాన్స్ లేదంటోంది. చైతూ తన అలక తీర్చడని, సిగ్గు లేకుండా తనే తిరిగి
చైతన్యతో కలిసిపోతానని చెబుతోంది ఈ స్టార్ హీరోయిన్.

Tags:    
Advertisement

Similar News