బన్నీ కోసం ఆమె ఒప్పుకుంది

సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమాలో ఐటెంసాంగ్ ఉంది. ఈ పాటను ఓ స్టార్ హీరోయిన్ తో చేయించాలనేది సుక్కూ ప్లాన్. దీనికోసం అంతా కలిసి పూజా హెగ్డే పేరు కూడా అనేసుకున్నారు. కానీ అంతలోనే నిర్ణయం మారిపోయింది. పుష్ప ఐటెంసాంగ్ కోసం పూజా హెగ్డే స్థానంలో దిశా పటానీని తీసుకున్నారు. ఈ నిర్ణయం వెనక కారణం ఒకే ఒక్కటి. అదే పాన్ ఇండియా అప్పీల్. పూజా హెగ్డేను తీసుకునే కంటే.. […]

Advertisement
Update:2021-05-27 13:05 IST

సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమాలో ఐటెంసాంగ్ ఉంది. ఈ పాటను ఓ స్టార్ హీరోయిన్ తో చేయించాలనేది సుక్కూ ప్లాన్. దీనికోసం అంతా కలిసి పూజా హెగ్డే పేరు కూడా అనేసుకున్నారు. కానీ అంతలోనే నిర్ణయం మారిపోయింది.

పుష్ప ఐటెంసాంగ్ కోసం పూజా హెగ్డే స్థానంలో దిశా పటానీని తీసుకున్నారు. ఈ నిర్ణయం వెనక కారణం ఒకే ఒక్కటి. అదే పాన్ ఇండియా అప్పీల్. పూజా హెగ్డేను తీసుకునే కంటే.. రీసెంట్ గా సల్మాన్ ఖాన్ సరసన నటించిన దిశాను తీసుకుంటే ప్రాజెక్టుకు పాన్ ఇండియా అప్పీల్ వస్తుందనేది మేకర్స్ ఆలోచన.

అటు దిశా కూడా అల్లు అర్జున్ అంటే ఇష్టాన్ని ప్రదర్శించింది. అల్లు అర్జున్ తో కలిసి డాన్స్ చేయాలని ఉందంటూ గతంలో ప్రకటించింది. ఆమె కోరిక పుష్ప ఐటెంసాంగ్ తో నెరవేరబోతోంది. అన్నట్టు ఈ ఒక్క సాంగ్ కోసం దిశాకు కోటి రూపాయలు ఇస్తున్నారని టాక్.

Tags:    
Advertisement

Similar News