మళ్లీ మెగా కాంపౌండ్ లోకి..!

హీరోయిన్ కృతి శెట్టి తొలి పరిచయం మెగా కాంపౌండ్ లోనే జరిగింది. వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఉప్పెన సినిమాతో ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు మరోసారి ఆమె మెగా కాంపౌండ్ లో నటించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. త్వరలోనే కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు సాయితేజ్. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా ఈ సినిమా అధికారిక ప్రకటన చాన్నాళ్ల కిందటే వచ్చింది. సుకుమార్ ఈ సినిమాకు కథ అందిస్తున్నాడు. ఇప్పుడీ మూవీలో […]

Advertisement
Update:2021-05-26 13:38 IST

హీరోయిన్ కృతి శెట్టి తొలి పరిచయం మెగా కాంపౌండ్ లోనే జరిగింది. వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన
ఉప్పెన సినిమాతో ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు మరోసారి ఆమె మెగా కాంపౌండ్ లో
నటించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

త్వరలోనే కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు సాయితేజ్. బీవీఎస్ఎన్ ప్రసాద్
నిర్మాతగా ఈ సినిమా అధికారిక ప్రకటన చాన్నాళ్ల కిందటే వచ్చింది. సుకుమార్ ఈ సినిమాకు కథ
అందిస్తున్నాడు. ఇప్పుడీ మూవీలో కృతి శెట్టిని హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో ఉన్నారు.

అయితే కృతి షెట్టి ప్రస్తుతం బిజీ. నాని సరసన శ్యామ్ సింగరాయ్ చేస్తోంది. సుధీర్ బాబు, రామ్ సినిమాల్లో కూడా నటిస్తోంది. ఇలాంటి టైమ్ లో ఆమె సాయితేజ్ సినిమాకు టైమ్ కేటాయించగలదా అనేది ప్రశ్న. అయితే అక్కడున్నది సుకుమార్ కాబట్టి.. అతడు చెబితే పనైపోతుంది.

Tags:    
Advertisement

Similar News