తెలంగాణ పదో తరగతి ఫలితాలు రేపే

కరోనా పరిస్థితుల నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలను మూసివేశారు. పబ్లిక్ పరీక్షల నిర్వహణకు కూడా అవకాశం లేకపోవడంతో గత ఏడాది ఇంటర్నల్ మార్కుల ఆధారంగా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు విద్యార్థులకు గ్రేడ్లు కేటాయించాయి. ఈ ఏడాది కూడా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండడంతో పాఠశాలలు, కళాశాలల తలుపులు తెరుచుకోలేదు. పిల్లలకు ఆన్లైన్ క్లాసుల ద్వారా విద్యాబోధన సాగించారు. రెండో ఏడాది కూడా పలు రాష్ట్రాల ప్రభుత్వాలు పదో తరగతి పబ్లిక్ పరీక్షలను ఎత్తి వేశాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా […]

Advertisement
Update:2021-05-20 08:44 IST

కరోనా పరిస్థితుల నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలను మూసివేశారు. పబ్లిక్ పరీక్షల నిర్వహణకు కూడా అవకాశం లేకపోవడంతో గత ఏడాది ఇంటర్నల్ మార్కుల ఆధారంగా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు విద్యార్థులకు గ్రేడ్లు కేటాయించాయి. ఈ ఏడాది కూడా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండడంతో పాఠశాలలు, కళాశాలల తలుపులు తెరుచుకోలేదు.

పిల్లలకు ఆన్లైన్ క్లాసుల ద్వారా విద్యాబోధన సాగించారు. రెండో ఏడాది కూడా పలు రాష్ట్రాల ప్రభుత్వాలు పదో తరగతి పబ్లిక్ పరీక్షలను ఎత్తి వేశాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా టెన్త్ పరీక్షలు రద్దు చేసిన విషయం తెలిసిందే. గత ఏడాదిలాగే ఈసారి కూడా ఇంటర్నల్ మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్స్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో పదో తరగతి విద్యార్థుల ఫలితాలను శుక్రవారం విడుదల చేసేందుకు తెలంగాణ పరీక్షల విభాగం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఫలితాల ప్రకటన కు సంబంధించిన ప్రక్రియ పూర్తయింది.

సాధ్యమైనంతవరకు శుక్రవారం పదో తరగతి ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఒకవేళ ఏదైనా ఫలితాల విడుదలలో జాప్యం ఏర్పడితే శనివారం ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

కరోనా కారణంగా పరీక్షలు రాయడానికి అవకాశాలు లేకపోవడంతో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు అందరినీ పాస్ చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్థులకు ఫార్మేటివ్ అసెస్మెంట్(ఎఫ్ఏ -1)లో వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకొని గ్రేడ్లు కేటాయించనుంది.

Tags:    
Advertisement

Similar News