చరణ్ కు ఎర్త్ పెట్టిన కమల్ ఫార్ములా
ఇండియన్-2 వివాదం గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమా పూర్తవ్వకుండా మరో సినిమా స్టార్ట్ చేయడానికి వీల్లేదంటూ కోర్టు మెట్లెక్కింది లైకా ప్రొడక్షన్స్ సంస్థ. సినిమా లేట్ అవ్వడానికి తను కారణం కాదు కాబట్టి మరో సినిమా స్టార్ట్ చేసే హక్కు తనకు ఉందంటూ కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు శంకర్. ఇప్పుడీ వివాదాన్ని కోర్టు బయట పరిష్కరించే బాధ్యతను తీసుకున్నారు నటుడు కమల్ హాసన్. లైకా, శంకర్ మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇందులో […]
ఇండియన్-2 వివాదం గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమా పూర్తవ్వకుండా మరో సినిమా స్టార్ట్
చేయడానికి వీల్లేదంటూ కోర్టు మెట్లెక్కింది లైకా ప్రొడక్షన్స్ సంస్థ. సినిమా లేట్ అవ్వడానికి తను కారణం
కాదు కాబట్టి మరో సినిమా స్టార్ట్ చేసే హక్కు తనకు ఉందంటూ కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు శంకర్.
ఇప్పుడీ వివాదాన్ని కోర్టు బయట పరిష్కరించే బాధ్యతను తీసుకున్నారు నటుడు కమల్ హాసన్. లైకా,
శంకర్ మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇందులో భాగంగా కరోనా పరిస్థితులన్నీ సర్దుకున్న
తర్వాత.. ఒకేసారి బల్క్ లో 3 నెలల పాటు కాల్షీట్లు ఇవ్వడానికి తను సిద్ధమని తెలిపారు.
ఆ 90 రోజుల్లో సినిమాను పూర్తిచేసి, ఆ తర్వాత శంకర్ మరో సినిమా స్టార్ట్ చేసుకోవచ్చంటూ రాజీ
ప్రతిపాదన పెట్టారు కమల్. దీనికి లైకా నిర్మాతలు అంగీకరించారు. శంకర్ ఇంకా ఆలోచనలో ఉన్నారు.
ఎందుకంటే.. మరో 3 నెలల్లో రామ్ చరణ్ హీరోగా సినిమా స్టార్ట్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు శంకర్. దిల్
రాజు దీనికి నిర్మాత. ఒకవేళ కమల్ ప్రతిపాదనకు శంకర్ ఓకే అంటే.. చరణ్ సినిమా లేట్ అవ్వడం
ఖాయం. ఇప్పుడు బంతి శంకర్ కోర్టులో ఉంది. ఏం జరుగుతుందో చూడాలి.