అనుష్క ఓటీటీ ఎంట్రీ?

సెలక్టివ్ గా సినిమాలు చేస్తున్న అనుష్క త్వరలోనే ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతోందట. ఇప్పటికే కాజల్, తమన్న, రాశిఖన్నా లాంటి హీరోయిన్లు ఓటీటీలోకి రాగా.. ఇప్పుడీ లిస్ట్ లోకి అనుష్క కూడా చేరబోతోందనేది లేటెస్ట్ టాక్. టాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ డైరక్టర్, ఓ ఫిమేల్ ఓరియంటెడ్ కథను సిద్ధం చేసుకున్నాడట. ఈ కథను నెట్ ఫ్లిక్స్ కు వినిపించాడట. అనుష్క అయితే బాగుంటుందని సూచించాడట. అలా అనుష్క పేరు తెరపైకొచ్చింది. ఆ వెంటనే నెట్ ఫ్లిక్స్ […]

Advertisement
Update:2021-05-11 14:11 IST

సెలక్టివ్ గా సినిమాలు చేస్తున్న అనుష్క త్వరలోనే ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతోందట. ఇప్పటికే కాజల్,
తమన్న, రాశిఖన్నా లాంటి హీరోయిన్లు ఓటీటీలోకి రాగా.. ఇప్పుడీ లిస్ట్ లోకి అనుష్క కూడా
చేరబోతోందనేది లేటెస్ట్ టాక్.

టాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ డైరక్టర్, ఓ ఫిమేల్ ఓరియంటెడ్ కథను సిద్ధం చేసుకున్నాడట. ఈ కథను
నెట్ ఫ్లిక్స్ కు వినిపించాడట. అనుష్క అయితే బాగుంటుందని సూచించాడట. అలా అనుష్క పేరు
తెరపైకొచ్చింది. ఆ వెంటనే నెట్ ఫ్లిక్స్ జనాలు అనుష్కను సంప్రదించడం, భారీ రెమ్యూనరేషన్ కూడా
ఆఫర్ చేయడం జరిగిందట. కాకపోతే దీనిపై అనుష్క ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటున్నారు.

ప్రస్తుతం బరువు తగ్గే పనిలో ఉన్న అనుష్క.. పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత యూవీ క్రియేషన్స్
బ్యానర్ పై ఓ సినిమా చేయబోతోంది. నవీన్ పొలిశెట్టి అందులో హీరో. ఆ సినిమా పూర్తయిన తర్వాత
మాత్రమే నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీపై నిర్ణయం తీసుకుంటుంది అనుష్క.

Tags:    
Advertisement

Similar News