అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎడప్పాడి
అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎడప్పాడి పళని స్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ ప్రకటన విడుదల చేసింది. నూతన ఎమ్మెల్యేలు అందరూ శాసనసభా పక్ష నేతగా పళని స్వామిని ఎన్నుకున్నట్లు పార్టీ ఆ ప్రకటనలో పేర్కొంది. ఇంకా డిప్యూటీ నేత, విప్ ను ఎన్నుకోవాల్సి ఉంది. అన్నాడీఎంకే పార్టీ శాసనసభాపక్ష నేతగా పళని స్వామి ఎన్నికయ్యారని పార్టీ సీనియర్లు సెంగొట్టియన్, శ్రీనివాసన్, మునుస్వామి, తంగమణి స్పీకర్ కు ఓ లేఖ అందజేశారు. శాసనసభా పక్ష నేతగా పళని […]
అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎడప్పాడి పళని స్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ ప్రకటన విడుదల చేసింది. నూతన ఎమ్మెల్యేలు అందరూ శాసనసభా పక్ష నేతగా పళని స్వామిని ఎన్నుకున్నట్లు పార్టీ ఆ ప్రకటనలో పేర్కొంది. ఇంకా డిప్యూటీ నేత, విప్ ను ఎన్నుకోవాల్సి ఉంది. అన్నాడీఎంకే పార్టీ శాసనసభాపక్ష నేతగా పళని స్వామి ఎన్నికయ్యారని పార్టీ సీనియర్లు సెంగొట్టియన్, శ్రీనివాసన్, మునుస్వామి, తంగమణి స్పీకర్ కు ఓ లేఖ అందజేశారు.
శాసనసభా పక్ష నేతగా పళని స్వామి, మాజీ డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం పోటీ పడినప్పటికీ చివరికి ఎడప్పాడి ఆ పదవిని దక్కించుకున్నారు. గత శుక్రవారం పార్టీ శాసనసభా పక్ష నేతను ఎన్నుకునేందుకు కోసం అన్నాడీఎంకే నూతన ఎమ్మెల్యేలు ఒక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పళని, పన్నీర్ వర్గాలు శాసనసభా పక్ష నేత పదవి తమ నేతకంటే తమనేతకు అప్పగించాలంటూ పట్టుబట్టాయి. చివరికి ఒక దశలో సమావేశం రసాభాసగా మారడంతో తిరిగి సోమవారం సమావేశం నిర్వహించి శాసనసభా పక్ష నేతను ఎన్నుకోవాలని నిర్ణయించారు.
మొన్నటివరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నానని, 65 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నానని అలాంటిది పదవి కోసం పన్నీర్ సెల్వం తనకు ఎలా పోటీకి వస్తారని పళని స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ సమన్వయకర్తను తానేనని, శాసనసభా పక్ష నేత పదవికి కూడా కాని తానే అర్హుడనని, జయ జీవించి ఉన్న కాలంలోనే ఆమె తనకు రెండు సార్లు ముఖ్యమంత్రి పదవి అప్పగించారంటే పార్టీకి తానెంత ముఖ్యుడినో గుర్తించాలని సీనియర్ నేతల వద్ద పన్నీర్ సెల్వం వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా కొంతమంది నేతలు మధ్యేమార్గంగా శశికళను పార్టీలోకి తెచ్చి పార్టీ సర్వాధికారులు ఆమెకు అప్పగించాలని సూచించారు. ఈ నేపథ్యంలో సోమవారం జరిగిన అన్నాడీఎంకే పార్టీ నూతన ఎమ్మెల్యేల సమావేశంలో ఎడప్పాడి పళని స్వామిని పార్టీ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.