సుప్రీం చీఫ్​ జస్టిస్​గా ఎన్​వీ రమణ ప్రమాణం..!

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నూతలపాటి వెంకట రమణ ఇవాళ ప్రమాణం చేశారు. 48 వ చీఫ్​ జస్టిస్​గా ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ, పలువురు ముఖ్యనేతలు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా జిల్లా పొన్నవరం గ్రామంలో 1957 ఆగస్టు 27న రమణ జన్మించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్‌గా పనిచేశారు. వ్యవసాయ కుటుంబం నుంచి […]

Advertisement
Update:2021-04-24 09:35 IST

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నూతలపాటి వెంకట రమణ ఇవాళ ప్రమాణం చేశారు. 48 వ చీఫ్​ జస్టిస్​గా ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ, పలువురు ముఖ్యనేతలు హాజరయ్యారు.

ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా జిల్లా పొన్నవరం గ్రామంలో 1957 ఆగస్టు 27న రమణ జన్మించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్‌గా పనిచేశారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన రమణ బీఎస్సీ, బీఎల్ పూర్తిచేశారు. 1983 ఫిబ్రవరి 10న న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్(క్యాట్), ఉమ్మడి ఏపీ హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో ప్రాక్టీసు చేశారు. వివిధ ప్రభుత్వ సంస్థలకు పానెల్ కౌన్సిల్‌గా ఉన్నారు.

క్యాట్‌లో కేంద్ర ప్రభుత్వం, రైల్వేల తరఫున పనిచేశారు. 2000 జూన్ 27న ఏపీ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013 మార్చి 10 నుంచి మే 20 వరకూ ఏపీ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్‌గా పనిచేశారు.

2013 సెప్టెంబరు 2న దిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పదోన్నతి పొందారు. 2014 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సుప్రీం చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు చేపట్టిన నూతలపాటి వెంకట రమణకు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.

Tags:    
Advertisement

Similar News