ఏపీ విద్యార్థులకు ‘మైక్రోసాఫ్ట్’​ శిక్షణ..!

ఏపీలోని విద్యావంతులైన నిరుద్యోగులకు ప్రముఖ సంస్థ మైక్రోసాఫ్ట్​ ఉచిత శిక్షణ ఇవ్వనున్నది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వంతో మైక్రోసాఫ్ట్​ ఒప్పందం కుదుర్చుకున్నది. ఓ ప్రముఖ సంస్థ నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వడం ఇదే తొలిసారి అని ఏపీ ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్​ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు.. మైక్రోసాఫ్ట్​ సంస్థ ప్రతినిధులు ఒప్పందపత్రాలపై సంతకాలు చేశారు. మైక్రోసాఫ్ట్​తో కుదుర్చుకున్న ఒప్పందానికి సంబంధించిన వివరాలను మంత్రి మీడియాకు వెల్లడించారు. చాలా మంది విద్యార్థులు ఇంజినీరింగ్​, ఇతర […]

Advertisement
Update:2021-04-24 06:53 IST

ఏపీలోని విద్యావంతులైన నిరుద్యోగులకు ప్రముఖ సంస్థ మైక్రోసాఫ్ట్​ ఉచిత శిక్షణ ఇవ్వనున్నది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వంతో మైక్రోసాఫ్ట్​ ఒప్పందం కుదుర్చుకున్నది. ఓ ప్రముఖ సంస్థ నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వడం ఇదే తొలిసారి అని ఏపీ ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్​ రెడ్డి పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు.. మైక్రోసాఫ్ట్​ సంస్థ ప్రతినిధులు ఒప్పందపత్రాలపై సంతకాలు చేశారు. మైక్రోసాఫ్ట్​తో కుదుర్చుకున్న ఒప్పందానికి సంబంధించిన వివరాలను మంత్రి మీడియాకు వెల్లడించారు. చాలా మంది విద్యార్థులు ఇంజినీరింగ్​, ఇతర వృత్తి విద్య కోర్సులు చేస్తున్నప్పటికీ .. వాళ్లకు అవసరమైన టెక్నికల్​, కమ్యూనికేషన్ స్కిల్స్​ ఉండటం లేదని.. ఆ లోటును తీర్చేందుకు మైక్రోసాఫ్ట్​ సంస్థ ముందుకొచ్చిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్​లోని దాదాపు 1.60 లక్షల మందికి ఈ సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వబోతున్నట్టు పేర్కొన్నారు.

మైక్రోసాఫ్ట్​ మొత్తం 42 రకాల కోర్సుల్లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వబోతున్నదని చెప్పారు. అంతేకాక విద్యార్థులకు కమ్యూనికేషన్​, డిజిటల్​ స్కిల్స్​ కూడా నేర్పించబోతున్నామని చెప్పారు. ప్రపంచ ప్రఖ్యాత సంస్థ మైక్రోసాఫ్ట్​.. ఏపీలోని విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ముందుకు రావడం ఎంతో గొప్ప విషయమన్నారు.

ఏపీ విద్యార్థులను ఐటీ నిపుణులుగా తీర్చిదిద్దేందుకు సీఎం జగన్​ కృషి చేస్తున్నారన్నారు. ఇందుకు మైక్రోసాఫ్ట్​ సంస్థ సహకరిస్తున్నదని చెప్పారు. మైక్రోసాఫ్ట్​ సంస్థతో జరిగిన ఈ అవగాహన ఒప్పందం వల్ల రాష్ట్రంలోని ఇంజినీరింగ్​, వృత్తి విద్యా కళాశాల విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కళాశాలల నుంచి బయటకు వచ్చే విద్యార్థులకు ముందుగానే మైక్రోసాఫ్ట్​ ద్వారా నైపుణ్య శిక్షణ ఇవ్వడం, సర్టిఫికెట్​ ద్వారా మంచి అవకాశాలు పొందడానికి మార్గం సుగుమవుతుందన్నారు.

మైక్రోసాఫ్ట్​ ఇండియా ప్రెసిడెంట్ అనంత మహేశ్వరి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్​ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి తాము ఎంతో ఉత్సాహంతో ఉన్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్​లోని యువతలో నైపుణ్యాలకు పదునుపెట్టి వారు మంచి ఉద్యోగాలు పొందటానికి సహకరిస్తామని తెలిపారు.

మైక్రోసాఫ్ట్​కు చెందిన అజ్యుర్​ టెక్నాలజీ కోర్సులు, ఆర్టిఫీషియల్​ ఇంటెలిజెన్స్​, సైబర్​ సెక్యూరిటీ మైక్రోసాఫ్ట్​ డైనమిక్స్​ 365, పవర్​ యాప్​ ఫండమెంటల్స్, అజ్యూర్​ డాటా అనలిటిక్స్​, డాటాబేస్​ తదితర 42 కోర్సుల్లో శిక్షణ ఇవ్వనుంది. ఆన్​లైన్​, ఆఫ్​లైన్​లో ఈ కోర్సులను నేర్పించనున్నారు.

ఇంటర్వ్యూలకు హాజరయ్యేందుకు కావాల్సిన స్కిల్స్​, భాషా నైపుణ్యాలు, ఆహార్యం, హావభావాలు కూడా నేర్పించనున్నారు. ఈ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు మైక్రోసాఫ్ట్​ సంస్థ 100 డాలర్ల సాయం కూడా చేయనున్నది.

Tags:    
Advertisement

Similar News