అగ్రిమెంట్ పై సంతకం చేసిన మహేష్

కొత్త సినిమాపై మహేష్ బాబు సంతకం పెట్టేశాడు. ఇక అధికారికంగా ప్రకటన చేయడమే ఆలస్యం. త్రివిక్రమ్ దర్శకత్వంలో చాన్నాళ్ల తర్వాత నటించబోతున్నాడు ఈ హీరో. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తాజాగా సంతకాల ప్రక్రియ ముగిసింది. మహేష్ కు రెమ్యూనరేషన్ మాత్రమే కాదు, కూసింత వాటా కూడా ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. ప్రస్తుతం సర్కారువారి పాట షూటింగ్ నిలిచిపోయింది. సెట్స్ లో కరోనా రావడంతో మహేష్ క్వారంటైన్ లోకి వెళ్లిపోయాడు. ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ సినిమా ఫార్మాలిటీస్ […]

Advertisement
Update:2021-04-23 15:27 IST

కొత్త సినిమాపై మహేష్ బాబు సంతకం పెట్టేశాడు. ఇక అధికారికంగా ప్రకటన చేయడమే ఆలస్యం.
త్రివిక్రమ్ దర్శకత్వంలో చాన్నాళ్ల తర్వాత నటించబోతున్నాడు ఈ హీరో. ఈ ప్రాజెక్టుకు సంబంధించి
తాజాగా సంతకాల ప్రక్రియ ముగిసింది. మహేష్ కు రెమ్యూనరేషన్ మాత్రమే కాదు, కూసింత వాటా కూడా
ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది.

ప్రస్తుతం సర్కారువారి పాట షూటింగ్ నిలిచిపోయింది. సెట్స్ లో కరోనా రావడంతో మహేష్ క్వారంటైన్
లోకి వెళ్లిపోయాడు. ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ సినిమా ఫార్మాలిటీస్ పూర్తిచేశాడు. తన సినిమాలకు
సహ-నిర్మాతగా వ్యవహరిస్తూ, లాభాల్లో వాటా కూడా తీసుకుంటాడు మహేష్. ఈ సినిమాకు కూడా అదే
పద్ధతి.

హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమా కోసం త్రివిక్రమ్ ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్
పూర్తిచేశాడు. ఎన్టీఆర్ తో చేయాల్సిన సినిమా ఆలస్యం అవ్వడంతో, ఆ ప్రాజెక్టును పక్కనపెట్టి.. ప్రస్తుతం
పూర్తిగా మహేష్ సినిమాకే టైమ్ కేటాయిస్తున్నాడు.

Tags:    
Advertisement

Similar News