బన్నీ అస్సలు తగ్గట్లేదుగా!
కరోనా కారణంగా ఇప్పటికే పలు సినిమాల షూటింగ్స్ నిలిచిపోయాయి. కానీ బన్నీ మాత్రం తన జోరు తగ్గించలేదు. పుష్ప సినిమా షూటింగ్ ను కొనసాగిస్తూనే ఉన్నాడు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ, పుష్ప సినిమా షూటింగ్ ను శరవేగంగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లోని కొన్ని లొకేషన్స్ లో మేజర్ సీన్స్ కంప్లీట్ చేసిన యూనిట్.. తాజాగా బూత్ బంగ్లాలో వేసిన సెట్ లో పీటర్ హెయిన్స్ కంపోజిషన్ లో ఓ యాక్షన్ ఎపిసోడ్ కూడా షూట్ […]
కరోనా కారణంగా ఇప్పటికే పలు సినిమాల షూటింగ్స్ నిలిచిపోయాయి. కానీ బన్నీ మాత్రం తన జోరు తగ్గించలేదు. పుష్ప సినిమా షూటింగ్ ను కొనసాగిస్తూనే ఉన్నాడు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ, పుష్ప సినిమా షూటింగ్ ను శరవేగంగా కొనసాగిస్తున్నారు.
ఇప్పటికే హైదరాబాద్ లోని కొన్ని లొకేషన్స్ లో మేజర్ సీన్స్ కంప్లీట్ చేసిన యూనిట్.. తాజాగా బూత్ బంగ్లాలో వేసిన సెట్ లో పీటర్ హెయిన్స్ కంపోజిషన్ లో ఓ యాక్షన్ ఎపిసోడ్ కూడా షూట్ చేశారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్ కానుందని ఇన్ సైడ్ టాక్.
ఈ రోజు సినిమాలో విలన్ గా నటించబోతున్న ఫహాద్ ఫాజిల్ కూడా షూట్ లో జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం యూసఫ్ గూడ దగ్గరున్న ఓ కల్యాణ మండపంలో సన్నివేశాలు తీస్తున్నారు.
మరో వైపు పుష్ప ప్రకటించిన డేట్ కి రిలీజ్ అవ్వడం కష్టమనే టాక్ వినబడుతుంది. అయితే మేకర్స్ జెట్ స్పీడ్ లో షూటింగ్ పూర్తి చేసి ప్రకటించిన డేట్ వరకూ ఫస్ట్ కాపీ రెడీ చేసే పనిలో ఉన్నారు. అప్పటికల్లా పరిస్థితులు చక్కబడితే అనుకున్నట్టు ఆగస్ట్ కే సినిమాను రిలీజ్ చేస్తారు. లేదంటే అక్టోబర్ లో దసరా కానుకగా పుష్ప థియేటర్స్ లోకి వస్తుంది.