మళ్లీ క్లారిటీ ఇచ్చిన దేవరకొండ
సుకుమార్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో సినిమాను చాన్నాళ్ల కిందటే ప్రకటించారు. ప్రస్తుతం బన్నీతో చేస్తున్న పుష్ప సినిమా పూర్తయిన తర్వాత, విజయ్ దేవరకొండనే డైరక్ట్ చేయబోతున్నాడు సుక్కూ. అయితే ఇప్పుడీ సినిమాపై పుకార్లు అందుకున్నాయి. సినిమా ఆగిపోయిందంటూ ఊహాగానాలు చెలరేగాయి. రీసెంట్ గా రామ్ చరణ్, సుకుమార్ మధ్య స్టోరీ డిస్కషన్లు జరిగాయట. రంగస్థలం తర్వాత మరోసారి సుక్కూతో కలిసి నటించేందుకు చెర్రీ ఓకే చేశాడట. ఆర్ఆర్ఆర్ తర్వాత ఇదే వస్తుందంటూ పుకార్లు వచ్చాయి. దీంతో […]
సుకుమార్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో సినిమాను చాన్నాళ్ల కిందటే ప్రకటించారు. ప్రస్తుతం
బన్నీతో చేస్తున్న పుష్ప సినిమా పూర్తయిన తర్వాత, విజయ్ దేవరకొండనే డైరక్ట్ చేయబోతున్నాడు
సుక్కూ. అయితే ఇప్పుడీ సినిమాపై పుకార్లు అందుకున్నాయి. సినిమా ఆగిపోయిందంటూ ఊహాగానాలు
చెలరేగాయి.
రీసెంట్ గా రామ్ చరణ్, సుకుమార్ మధ్య స్టోరీ డిస్కషన్లు జరిగాయట. రంగస్థలం తర్వాత మరోసారి సుక్కూతో కలిసి నటించేందుకు చెర్రీ ఓకే చేశాడట. ఆర్ఆర్ఆర్ తర్వాత ఇదే వస్తుందంటూ పుకార్లు వచ్చాయి. దీంతో విజయ్ దేవరకొండతో చేయాల్సిన సినిమా ఆగిపోయిందంటూ ప్రచారం మొదలైంది.
2-3 రోజులుగా వస్తున్న ఈ పుకార్లకు యూనిట్ చెక్ పెట్టింది. సుకుమార్, విజయ్ దేవరకొండ సినిమా ఆగిపోలేదని స్పష్టంచేసింది. లైగర్ తర్వాత విజయ్ దేవరకొండ, పుష్ప తర్వాత సుకుమార్ చేయబోయే ప్రాజెక్టు ఇదేనంటూ ప్రకటన చేసింది. దీంతో ఇన్నాళ్లూ ఈ కాంబినేషన్ పై వస్తున్న పుకార్లకు చెక్ పడింది.