ఢిల్లీలో నేటి నుంచి లాక్​డౌన్​..!

కరోనా విలయతాండవం చేస్తున్న దృష్ట్యా ఢిల్లీలో లాక్​డౌన్​ విధించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. నేటి నుంచి ఏప్రిల్​ 26 వరకు ఢిల్లీలో లాక్​ డౌన్​ విధిస్తున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ ప్రకటించారు. గత కొన్నిరోజులుగా మహారాష్ట్ర, ఢిల్లీలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై అక్కడి రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నది. ఇందులో భాగంగా ఇవాళ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ లెఫ్ట్​నెంట్​ గవర్నర్​ […]

Advertisement
Update:2021-04-19 10:59 IST

కరోనా విలయతాండవం చేస్తున్న దృష్ట్యా ఢిల్లీలో లాక్​డౌన్​ విధించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. నేటి నుంచి ఏప్రిల్​ 26 వరకు ఢిల్లీలో లాక్​ డౌన్​ విధిస్తున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ ప్రకటించారు. గత కొన్నిరోజులుగా మహారాష్ట్ర, ఢిల్లీలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై అక్కడి రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నది.

ఇందులో భాగంగా ఇవాళ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ లెఫ్ట్​నెంట్​ గవర్నర్​ అనిల్​ బైజాల్​తో సమావేశమయ్యారు. అనంతరం రాష్ట్రంలో లాక్​డౌన్​ విధిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. అయితే వలసకూలీలు, కార్మికులు, చిరుద్యోగుల ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఇక నుంచి ఢిల్లీలో కఠిన ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. దుకాణాలు, బార్లు, పబ్బులు, హోటళ్లు మూసివేయనున్నారు. అత్యవసర సేవలు మినహాయించి మిగతావన్నీ బంద్​ చేయనున్నారు.

ఢిల్లీలో తాజాగా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. రోజూకు 25వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. మరోవైపు ఢిల్లీలోని పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్​, బెడ్ల కొరత కూడా ఏర్పడింది.

ఢిల్లీలో కొత్తగా 25,462 పాజిటివ్ కేసులు వచ్చాయి. ఇప్పటివరకూ ఎప్పుడూ ఇన్ని ఎక్కువ కేసులు ఒకే రోజు రాలేదు. మొత్తం కేసుల సంఖ్య 8,53,460కి చేరింది. నిన్న 161 మంది చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య 12,121కి చేరింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.

Tags:    
Advertisement

Similar News