పుకార్లు నమ్మొద్దంటున్న వకీల్ సాబ్

ప్రస్తుతం థియేటర్లలో పడుతూలేస్తూ సాగుతోంది వకీల్ సాబ్. నిన్నట్నుంచి ఈ సినిమాకు వసూళ్లు గణనీయంగా తగ్గిపోయాయి. ఇలాంటి టైమ్ లో వచ్చిన ఓ పుకారు, వకీల్ సాబ్ వసూళ్లపై మరింత ప్రభావం చూపించింది. అదేంటంటే.. ఈ సినిమాను మరికొన్ని రోజుల్లో ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారట. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో అనుకున్న టైమ్ కంటే ముందే ఈ సినిమాను స్ట్రీమింగ్ కు తెస్తారంటూ పుకార్లు ఊపందుకున్నాయి. దీంతో వకీల్ సాబ్ సినిమాకు ఇంకా వసూళ్లు తగ్గిపోయే ప్రమాదం […]

Advertisement
Update:2021-04-13 16:14 IST

ప్రస్తుతం థియేటర్లలో పడుతూలేస్తూ సాగుతోంది వకీల్ సాబ్. నిన్నట్నుంచి ఈ సినిమాకు వసూళ్లు
గణనీయంగా తగ్గిపోయాయి. ఇలాంటి టైమ్ లో వచ్చిన ఓ పుకారు, వకీల్ సాబ్ వసూళ్లపై మరింత ప్రభావం
చూపించింది. అదేంటంటే.. ఈ సినిమాను మరికొన్ని రోజుల్లో ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారట.
అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో అనుకున్న టైమ్ కంటే ముందే ఈ సినిమాను స్ట్రీమింగ్ కు తెస్తారంటూ
పుకార్లు ఊపందుకున్నాయి. దీంతో వకీల్ సాబ్ సినిమాకు ఇంకా వసూళ్లు తగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది.

ఇలా పుకార్లు వచ్చిన వెంటనే యూనిట్ రంగంలోకి దిగింది. వకీల్ సాబ్ సినిమా ఇప్పట్లో ఓటీటీలోకి
రాదని, అంతా థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చాడు.

“వకీల్ సాబ్ సినిమాకు థియేటర్ లో సూపర్ రెస్పాన్స్ ఉంది. ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నాం
అనే వార్తల్లో నిజం లేదు. ఇంత పెద్ద సినిమాను థియేటర్ లో చూస్తే వచ్చే ఆనందం ఓటీటీలో చూస్తే
రాదు. ఏ స్టార్ హీరో సినిమా అయినా 50 రోజుల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేయాలనే రూల్ ఉంది. కాబట్టి
కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ వకీల్ సాబ్ చిత్రాన్ని థియేటర్ లో చూడండి.”

ఇలా పుకార్లకు పూర్తిస్థాయిలో చెక్ పెట్టాడు నిర్మాత దిల్ రాజు. పవన్ కల్యాణ్ కమ్ బ్యాక్ మూవీగా గుర్తింపు
తెచ్చుకున్న ఈ సినిమా మొదటి 3 రోజుల్లోనే 65 శాతం బ్రేక్ ఈవెన్ సాధించింది. ఈ వారంలో ప్రాఫిట్ జోన్ లోకి ఎంటరవుతుందని ట్రేడ్ అంచనా వేస్తోంది.

Tags:    
Advertisement

Similar News