‘బొమ్మ’ కు కరోనా.. షూటింగ్‌లు బంద్..!
ఇప్పటికే కరోనా కారణంగా టాలీవుడ్ ఇండస్ట్రీ కుప్పకూలింది. ఈ రంగం మీద ఆధారపడ్డ అనేకమంది కరోనా ఎఫెక్ట్‌తో ఉపాధి దొరక్క రోడ్డున పడ్డారు. షూటింగ్ పూర్తి చేసుకున్న పెద్ద సినిమాలు సైతం ఓటీటీలో రిలీజ్ చేసుకోవాల్సిన దుస్థితి దాపురించింది. కరోనా తగ్గుముఖం పట్టడంతో గత కొంతకాలంగా మళ్లీ థియేటర్లు తెరుచుకున్నాయి. 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుస్తున్నాయి. దీంతో ప్రొడ్యూసర్లు ఊపిరి పీల్చుకున్నారు. కానీ తాజా పరిణామాలతో మరోసారి సినిమా రంగం కుదేలయ్యే పరిస్థితి కనిపిస్తున్నది. సెకండ్ […]
ఇప్పటికే కరోనా కారణంగా టాలీవుడ్ ఇండస్ట్రీ కుప్పకూలింది. ఈ రంగం మీద ఆధారపడ్డ అనేకమంది కరోనా ఎఫెక్ట్‌తో ఉపాధి దొరక్క రోడ్డున పడ్డారు. షూటింగ్ పూర్తి చేసుకున్న పెద్ద సినిమాలు సైతం ఓటీటీలో రిలీజ్ చేసుకోవాల్సిన దుస్థితి దాపురించింది.
కరోనా తగ్గుముఖం పట్టడంతో గత కొంతకాలంగా మళ్లీ థియేటర్లు తెరుచుకున్నాయి. 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుస్తున్నాయి. దీంతో ప్రొడ్యూసర్లు ఊపిరి పీల్చుకున్నారు. కానీ తాజా పరిణామాలతో మరోసారి సినిమా రంగం కుదేలయ్యే పరిస్థితి కనిపిస్తున్నది.
సెకండ్ వేవ్ సినీ రంగాన్ని కుదిపేస్తున్నది. ముంబైలో కరోనా కేసులు పెరుగుతుండంతో అక్కడ పెద్ద సినిమాల షూటింగ్ లు ఆపేశారు. బాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు ఇటీవల కరోనా బారిన పడ్డారు. తెలంగాణలోనూ రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. అయితే లాక్డౌన్ విధించే పరిస్థితి ఉండబోదని ఆరోగ్యమంత్రి ఈటల స్పష్టం చేశారు.
కాగా పలు సినీ యూనిట్లలో కొంతమందికి కరోనా సోకడంతో షూటింగ్ లు ఆపేశారు. ఇటీవల హీరో పవన్ కల్యాణ్ కూడా తన సిబ్బందికి కరోనా సోకడంతో క్వారంటైన్లోకి వెళ్లిన విషయం తెలిసిందే.
సెకండ్ వేవ్ కరోనాతో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు అంటున్నారు. ఇప్పుడు వచ్చే కరోనా తొందరగానే తగ్గిపోతుందని వారు అంటున్నారు. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా కొనసాగుతున్నది. ఇప్పటికే చాలా సినిమా యూనిట్లు తమ సిబ్బందికి వ్యాక్సిన్ వేయిస్తున్నారు.
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కరోనా వ్యాప్తిపైనే చర్చలు జరుగుతున్నాయి. ప్రముఖ హీరో రామ్ చరణ్, వరుణ్ తేజ్, నాగబాబు కు ఇటీవలే కరోనా సోకి తగ్గిపోయింది. వకీల్ సాబ్ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న హీరోయిన్ నివేదా థామస్ కు పాజిటివ్ నిర్ధారణ కాగా.. ఆ తర్వాత అదే సినిమాలో నటించిన మరో నటి అంజలికి కూడా కరోనా సోకి ప్రస్తుతం చికిత్స పొందుతోంది. రాజమౌళి తండ్రి, ప్రముఖ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ప్రసాద్ ప్రస్తుతం ఈ వ్యాధి బారిన పడి హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు.
మరోవైపు ప్రముఖ దర్శకుడు త్రివ్రిక్రమ్, నిర్మాత అల్లు అరవింద్ కరోనా బారిన పడి కోలుకున్నట్లు వార్తలు వచ్చాయి. సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు వరుసగా కరోనా బారిన పడుతుండటంతో భయంతో వణికిపోతున్నారు. షూటింగ్‌లు ఆగిపోతే తమ పరిస్థితి ఏమిటని వాళ్లు ఆందోళన చెందుతున్నారు.