సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు చాలా బాధ కలిగించాయి : అల్లు అర్జున్

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు చాల బాధ కలిగించాయని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అన్నారు.

Advertisement
Update:2024-12-21 20:55 IST

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు చాల బాధ కలిగించాయని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అన్నారు. రోడ్డు షో చేశామని చెప్పడం సరికాదని బన్నీచెప్పారు. పర్మిషన్ లేకుండా వెళ్లామనేది తప్పుడు ఆరోపణ అని బన్నీ తెలిపారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన గురించి మరుసటి రోజు తెలిసిందని ఆయన వివరించారు. తెలంగాణ ప్రభుత్వంతో ఎలాంటి వివాదం కోరుకోవట్లేదని పేర్కొన్నారు. పుష్ప2 సినిమా పెద్ద హిట్ అయినా 15 రోజులు ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేకపోతున్నానని పేర్కొన్నారు. తమ సినిమా భారీ హిట్ సాధించినప్పటికీ సెలబ్రేషన్స్‌లో పాల్గొనడం లేదని చెప్పుకొచ్చారు. అలాగే ఎవరో కావాలనే తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. తాను ఈ మూవీ కోసం మూడు సంవత్సరాల పాటు కష్టపడి పని చేశానని.. ఈ సినిమా చేస్తున్న ప్రతి సారి తాను.. తెలుగోడి సత్తా ప్రపంచవ్యాప్తంగా చాటాలని చూశానని.. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తనను కిందకు లాగేయ్యాలని చూస్తున్నారంటూ హీరో అల్లు అర్జున్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

నేను రేవతి ఫ్యామిలీని కలవాలని అనుకుంటే లీగల్ ప్రాబ్లమ్స్ వల్ల కలవలేకపోయాని బన్నీ తెలిపారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానులు చనిపోతేనే నేను విజయవాడ, వైజాగ్ వెళ్లి వాళ్ళ కుటుంబాలను కలిశానుఅలాంటిది నా అభిమాని చనిపోయిందని తెలిస్తే నేను వెళ్ళాలని అనుకొనా ఆయన అన్నారు. నేను వెళ్ళలేక తరువాత రోజు ఒక వీడియో ట్వీట్ చేశా.. దానికి నేను స్పందించలేదు అంటే ఎలా అల్లు అర్జున్ అన్నారు. బాధ కలిగిస్తున్నాయని.. మూడేళ్లుగా కష్టపడ్డ సినిమా ఎలా ఉందో చూద్దామని థియేటర్‌కు వెళ్లానని.. నేను పోలీసుల డైరెక్షన్‌లో వెళ్లానని తెలిపారు. పోలీసులే ట్రాఫిక్‌ క్లియర్‌ చేశారని.. తాను రోడ్‌ షో, ఊరేగింపు చేయలేదని స్పష్టం చేశారు. అంతమంది ప్రేమ చూపిస్తున్నప్పుడు నేను కార్లో కూర్చుంటే గర్వం అందని అనుకుంటారని తెలిపారు. థియేటర్‌లో ఏ పోలీస్‌ నన్ను కలువలేదని.. మా వాళ్లు చెబితేనే తాను థియేటర్‌ నుంచి వెళ్లిపోయానన్నారు. రేవతి చనిపోయిందని తర్వాతి రోజే నాకు తెలిసిందన్నారు.

Tags:    
Advertisement

Similar News