‘సాగర్’​ అంటే కేసీఆర్​కు వణుకు..! రేవంత్​ ఫైర్​..!

తెలంగాణలో నాగార్జున సాగర్​ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్​, టీఆర్​ఎస్​ మధ్యే నెలకొన్నది. ఇదిలా ఉంటే ఇవాళ కాంగ్రెస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ రేవంత్​రెడ్డి.. సాగర్​ పరిధిలోని పెద్దపూర మండలం పులిచర్లలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సాగర్​ పేరు చెబితేనే కేసీఆర్​కు వణుకు పుడుతున్నదని రేవంత్​ రెడ్డి అన్నారు. ఇక్కడ ఎలాగైనా గెలవాలని టీఆర్​ఎస్​ పన్నాగాలు రచించిందని చెప్పారు. ఈ నియోజకవర్గంలో […]

Advertisement
Update:2021-04-10 15:59 IST

తెలంగాణలో నాగార్జున సాగర్​ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్​, టీఆర్​ఎస్​ మధ్యే నెలకొన్నది. ఇదిలా ఉంటే ఇవాళ కాంగ్రెస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ రేవంత్​రెడ్డి.. సాగర్​ పరిధిలోని పెద్దపూర మండలం పులిచర్లలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

సాగర్​ పేరు చెబితేనే కేసీఆర్​కు వణుకు పుడుతున్నదని రేవంత్​ రెడ్డి అన్నారు. ఇక్కడ ఎలాగైనా గెలవాలని టీఆర్​ఎస్​ పన్నాగాలు రచించిందని చెప్పారు. ఈ నియోజకవర్గంలో గెలుపుకోసం టీఆర్​ఎస్​ రూ. 200 కోట్లు ఖర్చు పెట్టబోతున్నదని చెప్పారు.

దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారంలో కేవలం ఒక్కసారి మాత్రమే సభలో పాల్గొన్న కేసీఆర్​.. సాగర్​ ఎన్నికల్లో రెండోసారి కూడా భారీ బహిరంగ సభలో పాల్గొన బోతున్నారని చెప్పారు. దీన్ని బట్టి ఆయనకు ఓటమి భయం పట్టుకున్నదని చెప్పారు. సాగర్​లో కాంగ్రెస్​ పార్టీ ప్రచారంలో దూసుకుపోతున్నదని చెప్పారు. ఇప్పటికే జానారెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించారని.. ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని.. ప్రస్తుతం రెండో దశ ప్రచారం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ ఎన్నికలో జానారెడ్డి గెలుపు ఖాయమైందని పేర్కొన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలో ఎవరైనా ఎమ్మెల్యే అభ్యర్థి చనిపోతే .. అక్కడ చనిపోయిన అభ్యర్థి కుటుంబానికి టికెట్​ ఇచ్చి.. అన్ని పార్టీలు పోటీ నుంచి తప్పుకోవడం సంప్రదాయంగా ఉండేదని.. కానీ కేసీఆర్​ ఆ సంప్రదాయాన్ని తుంగలో తొక్కారని ఆరోపించారు. నోముల కుమారుడు భగత్​ పేరును వ్యూహాత్మకంగా ఆఖరి నిమిషంలో ఖరారు చేశారని విమర్శించారు.

జానారెడ్డి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని, దీనిపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని ఆయన సవాలు విసిరారు. మరోవైపు ఇక్కడ టీఆర్​ఎస్​ కూడా ప్రచారంలో దూసుకుపోతున్నది. ఎక్కడి కక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాలను విభజించుకొని ప్రచారం నిర్వహిస్తున్నారు.

సాగర్​లో గెలుపు కోసం టీఆర్​ఎస్​ సర్వ శక్తులను ఒడ్డుతున్నది. కాంగ్రెస్​ కూడా బాగానే ప్రచారం చేస్తున్నది. అయినప్పటికీ ఆ పార్టీ సహజంగానే అంతర్గత కుమ్ములాటలతో కొట్టుమిట్టాడుతున్నది. ఇదిలా ఉంటే రేవంత్​ విమర్శలకు టీఆర్​ఎస్​ ఎమ్మెల్యే బాల్క సుమన్​ తన దైన స్టయిల్​లో కౌంటర్​ ఇచ్చారు. రేవంత్​రెడ్డి వర్క్​ లేని కాంగ్రెస్​ పార్టీకి వర్కింగ్​ ప్రెసిడెంట్​ అంటూ ఆయన ఎద్దేవా చేశారు.

Tags:    
Advertisement

Similar News