నిన్న ప్రజలకు తిట్లు, నేడు నాయకులకు చీవాట్లు..

ఇటీల విజయవాడ, గుంటూరు మున్సిపల్ ఎన్నికల ప్రచార యాత్రలో ప్రజలపై తిట్ల వర్షం కురిపించిన చంద్రబాబు, ఇప్పుడు సొంత పార్టీ నేతలపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. మీకు సిగ్గులేదా, రోషం లేదా, పౌరుషం లేదా అంటూ ప్రచార పర్వంలో ప్రజల్ని తిట్టిపోసిన బాబు, తిరుపతి ఉప ఎన్నికల వేళ.. కబుర్లు కట్టిపెట్టండి, నక్క వినయాలు, జిత్తులమారి విధేయతలు ఇకపై చూపొద్దంటూ నాయకులకు చీవాట్లు పెట్టారు. ఒకరకంగా మున్సిపల్ ఎన్నికల్లో ఘోర ఓటమి వల్ల వచ్చిన అసహనాన్ని ఇలా […]

Advertisement
Update:2021-03-19 01:59 IST

ఇటీల విజయవాడ, గుంటూరు మున్సిపల్ ఎన్నికల ప్రచార యాత్రలో ప్రజలపై తిట్ల వర్షం కురిపించిన చంద్రబాబు, ఇప్పుడు సొంత పార్టీ నేతలపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. మీకు సిగ్గులేదా, రోషం లేదా, పౌరుషం లేదా అంటూ ప్రచార పర్వంలో ప్రజల్ని తిట్టిపోసిన బాబు, తిరుపతి ఉప ఎన్నికల వేళ.. కబుర్లు కట్టిపెట్టండి, నక్క వినయాలు, జిత్తులమారి విధేయతలు ఇకపై చూపొద్దంటూ నాయకులకు చీవాట్లు పెట్టారు. ఒకరకంగా మున్సిపల్ ఎన్నికల్లో ఘోర ఓటమి వల్ల వచ్చిన అసహనాన్ని ఇలా నాయకులపై చూపించారు.

తిరుపతి ఉప ఎన్నికల సన్నాహక సమావేశంలో చంద్రబాబు పార్టీ నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పనబాక లక్ష్మి పోటీలో ఉన్నారు అని రుజువుకోసమే చంద్రబాబు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టు స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఇదే మీటింగ్ లో మున్సిపల్ ఫలితాల ఫ్రస్టేషన్ అంతా చోటా మోటా నాయకులపై చూపించేశారు బాబు. విధేయతలు, మొహమాటాలు ఇక చెల్లవని తేల్చి చెప్పిన బాబు, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, నాయకుల క్షేత్ర స్థాయి పనితీరుకి అద్దం పట్టాయని చీవాట్లు పెట్టారు. తిరుపతి ఉప ఎన్నికను పెద్ద ఎన్నికగా భావించాలని, క్షేత్ర స్థాయి నాయకులు పనిచేయకుండా కబుర్లు చెబితే కుదరదని హెచ్చరించారు. పార్టీ శ్రేణులు తెగించి పోరాడాలని, అలా తెగించి పోరాడేవాళ్లకే పార్టీలో గుర్తింపు ఉంటుందని తేల్చి చెప్పారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను గుర్తించి అంశాల వారీగా పోరాడాలని అన్నారు. తిరుపతి లోక్ సభ నియోజకవర్గాన్ని 75 క్లస్టర్లుగా విభజించి, ప్రతి క్లస్టర్ కు ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. ఐదుగురు సభ్యులతో ఓ కమిటీ వేశారు. నారా లోకేష్ సహా అచ్చెన్నాయుడు, పనబాక కృష్ణయ్య, మాజీ మంత్రి సోమిరెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర అందులో సభ్యులుగా ఉంటారని వారి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పనిచేయాలని చెప్పారు.

మొత్తమ్మీద పనబాక అభ్యర్థిత్వంపై అనుమానాలు ముసురుకుంటున్న వేళ.. ఆమే తమ అభ్యర్థి అని చెప్పడానికి సమావేశం ఏర్పాటు చేసిన చంద్రబాబు తిరుపతి ఉప ఎన్నికలకు సిద్దంగా ఉండాలంటూ కార్యకర్తలకు సందేశాన్ని పంపించారు.

Tags:    
Advertisement

Similar News