మొత్తానికి సుక్కూ చెప్పిందే నిజమైంది
కొత్త హీరో, కొత్త హీరోయిన్, కొత్త దర్శకుడు.. ఇలా అంతా కొత్తోళ్లతో చేసిన సినిమా వంద కోట్లు కలెక్ట్ చేస్తుందంటే ఎలా ఉంటుంది. మరీ అతి చేస్తున్నారు అనిపిస్తుంది. ఉప్పెన ప్రమోషన్ టైమ్ లో సుకుమార్ ఇదే మాట చెప్పినప్పుడు అంతా పక్కకెళ్లి నవ్వుకున్నారు. ఉప్పెన సినిమా వంద కోట్లు కలెక్ట్ చేయడం ఏంటంటూ హేళన చేశారు. కానీ అప్పడు సుకుమార్ చెప్పిందే ఇప్పుడు నిజమైంది. ఉప్పెన సినిమా తాజాగా వంద కోట్ల రూపాయల గ్రాస్ సాధించి […]
కొత్త హీరో, కొత్త హీరోయిన్, కొత్త దర్శకుడు.. ఇలా అంతా కొత్తోళ్లతో చేసిన సినిమా వంద కోట్లు కలెక్ట్
చేస్తుందంటే ఎలా ఉంటుంది. మరీ అతి చేస్తున్నారు అనిపిస్తుంది. ఉప్పెన ప్రమోషన్ టైమ్ లో
సుకుమార్ ఇదే మాట చెప్పినప్పుడు అంతా పక్కకెళ్లి నవ్వుకున్నారు. ఉప్పెన సినిమా వంద కోట్లు కలెక్ట్
చేయడం ఏంటంటూ హేళన చేశారు. కానీ అప్పడు సుకుమార్ చెప్పిందే ఇప్పుడు నిజమైంది.
ఉప్పెన సినిమా తాజాగా వంద కోట్ల రూపాయల గ్రాస్ సాధించి ట్రేడ్ ను షాక్ కు గురిచేసింది. 50 కోట్లు
కలెక్ట్ చేస్తే చాలా ఎక్కువ అనుకున్నారంతా. కానీ ఉప్పెన సినిమా అనూహ్యంగా వంద కోట్లు కలెక్ట్ చేసి
షాక్ కు గురిచేసింది.
హృతిక్ రోషన్ హీరోగా పరిచయమైన కహోనా ప్యార్ హై సినిమా అప్పట్లో ఎంత హిట్టయిందో.. ఇప్పుడు
వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమైన ఉప్పెన సినిమా అంత సంచలనం సృష్టించింది. అలా తన తొలి
సినిమాతోనే రెవెన్యూ పరంగా అన్న సాయిధరమ్ తేజ్ ను మించిపోయాడు వైష్ణవ్ తేజ్. ఇప్పటివరకు
సాయి తేజ్ కు ఈ రేంజ్ హిట్ రాలేదు.