కొత్తరకం కాదు.. సరికొత్త రకం కరోనా..

కరోనా వ్యాప్తి తర్వాత ఏది పుకారో, ఏది నిజమో సామాన్య ప్రజలకు పూర్తిగా తెలియని పరిస్థితి. సెకండ్ వేవ్ అన్నారు, స్ట్రెయిన్ అని పేరు కూడా పెట్టారు, ఇంకోరకం కొత్త వ్యాధి వస్తుందని కూడా హెచ్చరించారు. ఇతర దేశాల సంగతి ఎలా ఉన్నా భారత్ లో మాత్రం కొత్తరకం కరోనా జాడ అతి కొద్దిమందిలోనే కనిపించింది. అలా కనిపించినవారి నుంచి అది ఎవరికీ వ్యాపించిన ఉదాహరణలు లేవు. అంటే సెకండ్ వేవ్ అయినా, టైప్ -2 అయినా […]

Advertisement
Update:2021-03-05 02:53 IST

కరోనా వ్యాప్తి తర్వాత ఏది పుకారో, ఏది నిజమో సామాన్య ప్రజలకు పూర్తిగా తెలియని పరిస్థితి. సెకండ్ వేవ్ అన్నారు, స్ట్రెయిన్ అని పేరు కూడా పెట్టారు, ఇంకోరకం కొత్త వ్యాధి వస్తుందని కూడా హెచ్చరించారు. ఇతర దేశాల సంగతి ఎలా ఉన్నా భారత్ లో మాత్రం కొత్తరకం కరోనా జాడ అతి కొద్దిమందిలోనే కనిపించింది. అలా కనిపించినవారి నుంచి అది ఎవరికీ వ్యాపించిన ఉదాహరణలు లేవు. అంటే సెకండ్ వేవ్ అయినా, టైప్ -2 అయినా భారత్ లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయిందనేది వాస్తవం. ఆ మాటకొస్తే ఇతర దేశాలతో పోల్చి చూస్తే భారత్ పై కరోనా ప్రభావం చాలా తక్కువ. జనాభా పరంగా కేసులు ఎక్కువగా ఉన్నా, మరణాల శాతంలో భారత్ దే చివరి ర్యాంక్.

బ్రెజిల్ లో టైప్-3
కొత్తరకం కరోనాల్లో బ్రిటన్ టైప్, బ్రెజిల్ టైప్ అనే రెండు రకాలున్నాయనే ప్రచారం జరిగింది. కరోనా పేరుని చైనాతోనే ఎందుకు లింకు పెట్టాలనుకున్న కొంతమంది, బ్రిటన్ కి, బ్రెజిల్ కి తగిలించేసి అంతర్జాతీయ సమన్యాయం పాటించారు. ఈ వ్యవహారంలో బ్రిటన్, బ్రెజిల్ మధ్య కొంతకాలం మాటల యుద్ధం కూడా నడిచింది. ఇప్పుడు బ్రెజిల్ లోనే మరో కొత్తరకం వైరస్ బయటపడినట్టు వార్తలొస్తున్నాయి. టీకాలు వేస్తున్నా కూడా.. బ్రెజిల్ లో రికార్డు స్థాయిలో మరణాలు నమోదవుతున్నాయి. ఒక్కరోజులోనే 1,910 మంది వైరస్‌ కి బలయ్యారు. ఇప్పటి వరకు బ్రెజిల్ ‌లో 2,59,402 మంది కరోనా కారణంగా చనిపోయారు. సెలవులు, కార్నివాల్స్ తో ఇప్పుడు అక్కడ కరోనా ఉధృతి మరింత పెరిగిందనే వార్తలొస్తున్నాయి.

పి -1 రకం కరోనా
అమెజాన్‌ రెయిన్ ఫారెస్ట్ ‌లో పి-1 అనే కొత్త వేరియంట్ తాజా విలయానికి కారణం అని బ్రెజిల్ వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. బ్రెజిల్ లోని మొత్తం 27 రాష్ట్రాలలో.. 17 రాష్ట్రాల్లో ఈ రకం కరోనా ఉనికి బయటపడిందని చెబుతున్నారు. అసలు దానికి కంటే ఈ ఉత్పరివర్తన చెందిన రకం.. వేగంగా వ్యాపిస్తోందని పరిశోధనలు పేర్కొన్నాయి. కొవిడ్ నుంచి కోలుకొన్న వారికి కూడా ఇది సోకుతోందనే అధ్యయనాలు మరింత కలవరపెడుతున్నాయి. 19 రాష్ట్రాల్లో ఐసీయూలు హౌస్ ఫుల్ అయ్యాయి. మిగతా దేశాలతో పోల్చి చూస్తే, బ్రెజిల్ లో వ్యాక్సినేషన్ కార్యక్రమం కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. చైనా తయారీ కరోనావ్యాక్, ఆక్స్ ఫర్డ్ టీకాలను బ్రిజిల్ లో వినియోగిస్తున్నారు. 21.2 కోట్ల జనాభా ఉన్న బ్రెజిల్ లో ప్రస్తుతం 70లక్షలమందికి మాత్రమే తొలిడోసు టీకా అందించారు. కరోనా మరణాలు పెరగడం, వ్యాక్సినేషన్ నిదానంగా సాగుతుండటంతో.. బ్రెజిల్ లో అధికార పక్షంపై విమర్శలు ఎక్కువవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితిని ప్రభుత్వ వైఫల్యంగా పేర్కొంటూ ప్రతిపక్షాలు నిరసనకు దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో పి-1 రకం కరోనా అటు ప్రపంచాన్ని కూడా కలవరపెడుతోంది.

Tags:    
Advertisement

Similar News