సుకుమార్ ఖాతాలో 20 కోట్లు
ఉప్పెన సినిమా బుచ్చిబాబుకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. వైష్ణవ్ తేజ్, కృతిషెట్టికి మంచి ఓపెనింగ్ ఇచ్చింది. అది మాత్రమే కాకుండా.. బుచ్చిబాబు, వైష్ణవ్ తేజ్, కృతి షెట్టి బోనస్ కూడా అందుకున్నారు. ఉప్పెన సక్సెస్ అవ్వడంతో బుచ్చిబాబుకు ఓ ఇల్లు కొనిపెట్టబోతోంది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. ఇక వైష్ణవ్ తేజ్ కు రెమ్యూనరేషన్ కాకుండా కోటి రూపాయలు గిఫ్ట్ గా ఇచ్చారు. అటు కృతి షెట్టికి అదనంగా మరో 25 లక్షలిచ్చారు. మరి ఈ సినిమాకు […]
ఉప్పెన సినిమా బుచ్చిబాబుకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. వైష్ణవ్ తేజ్, కృతిషెట్టికి మంచి ఓపెనింగ్
ఇచ్చింది. అది మాత్రమే కాకుండా.. బుచ్చిబాబు, వైష్ణవ్ తేజ్, కృతి షెట్టి బోనస్ కూడా అందుకున్నారు.
ఉప్పెన సక్సెస్ అవ్వడంతో బుచ్చిబాబుకు ఓ ఇల్లు కొనిపెట్టబోతోంది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. ఇక
వైష్ణవ్ తేజ్ కు రెమ్యూనరేషన్ కాకుండా కోటి రూపాయలు గిఫ్ట్ గా ఇచ్చారు. అటు కృతి షెట్టికి అదనంగా
మరో 25 లక్షలిచ్చారు. మరి ఈ సినిమాకు కర్త-కర్మ-క్రియగా వ్యవహరించిన సుకుమార్ ఎలాంటి లాభం
అందుకున్నాడు?
ఉప్పెన సినిమాకు సంబంధించి సుకుమార్ అక్షరాలా 20 కోట్ల రూపాయలు అందుకున్నాడని సమాచారం.
ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లకముందే.. 20శాతం వాటాను తనకు ఇవ్వాల్సిందిగా సుకుమార్ అగ్రిమెంట్
రాసుకున్నాడట. ఆ అగ్రిమెంట్ ప్రకారం తన వాటా కింద 20 కోట్ల రూపాయలు అందుకున్నాడట
సుకుమార్.
ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే.. సాధారణంగా తను దర్శకత్వం వహించినా కూడా సుకుమర్
20 కోట్ల రూపాయలే తీసుకుంటాడు. అలాంటిది ఉప్పెన సినిమాతో తన రెమ్యూనరేషన్ తో సమానంగా
ఎమౌంట్ అందుకున్నాడట ఈ దర్శకుడు.