హామీలపై సీఎం కేసీఆర్​కు.. రేవంత్​ లేఖ..!

టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ రేవంత్​రెడ్డి దూకుడు పెంచారు. ఓ వైపు పాదయాత్ర చేస్తూనే.. మరోవైపు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన పాదయాత్ర కొనసాగుతున్నది. రైతులకు కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. మరోవైపు రేవంత్​రెడ్డి సీఎం కేసీఆర్​కు ఓ లేఖ రాశారు. ఇప్పుడీ లేఖ సోషల్​మీడియాలో వైరల్​ అవుతున్నది. ఇంతకీ ఆయన లేఖలో ఏం రాశారంటే.. ‘సీఎం కేసీఆర్​ 2018 ఎన్నికల సమయంలో పింఛన్​ వయసు 57 ఏళ్లకు తగ్గిస్తానని ఓ హామీ ఇచ్చారు. […]

Advertisement
Update:2021-02-14 14:03 IST

టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ రేవంత్​రెడ్డి దూకుడు పెంచారు. ఓ వైపు పాదయాత్ర చేస్తూనే.. మరోవైపు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన పాదయాత్ర కొనసాగుతున్నది. రైతులకు కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. మరోవైపు రేవంత్​రెడ్డి సీఎం కేసీఆర్​కు ఓ లేఖ రాశారు. ఇప్పుడీ లేఖ సోషల్​మీడియాలో వైరల్​ అవుతున్నది.

ఇంతకీ ఆయన లేఖలో ఏం రాశారంటే.. ‘సీఎం కేసీఆర్​ 2018 ఎన్నికల సమయంలో పింఛన్​ వయసు 57 ఏళ్లకు తగ్గిస్తానని ఓ హామీ ఇచ్చారు. కానీ ఈ హామీ ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. ఈ హామీని దయచేసి నెరవేర్చాలి. అంతేకాక ప్రస్తుతం ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉంటే కేవలం ఒక్కరికి మాత్రమే పింఛన్​ ఇస్తున్నారు. అలా కాకుండా ఇద్దరికీ పింఛన్​ ఇవ్వాలి. ఒంటరి మహిళలకు ప్రస్తుతం తెలంగాణలో పింఛన్​ ఇస్తున్న విషయం నిజమే. అయితే 2018 తర్వాత ఒంటరి మహిళలను గుర్తించలేదు. వాళ్లను గుర్తించి పింఛన్​ అందజేయాలి’ అంటూ రేవంత్​రెడ్డి సీఎం కేసీఆర్​కు లేఖ రాశారు.

పాలమూరు, రంగారెడ్డి జిల్లాల పరిధిలో రేవంత్​ పాదయాత్ర కొనసాగుతున్నది. కాంగ్రెస్​ పార్టీ కార్యకర్తలు, ప్రజల నుంచి స్పందన బాగానే వస్తున్నది. అయితే మీడియాలో రేవంత్​ పాదయాత్రకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు. రేవంత్​ అనుచరులు సోషల్​మీడియాలో బాగానే ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్​ నేతలు కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, జగ్గారెడ్డి కూడా పాదయాత్రలు చేస్తామని ప్రకటించారు.

Tags:    
Advertisement

Similar News