మహేష్ కోసం అటవీ నేపథ్యం

మహేష్-రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న సినిమాపై రోజుకో పుకారు షికారు చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా మరో రూమర్ బయటకొచ్చింది. మహేష్ కోసం రాజమౌళి, ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ స్టోరీ రెడీ చేశాడట. ఇండియానా జోన్స్ సిరీస్ తరహాలో ఈ సినిమా ఉంటుందనే ప్రచారం మొదలైంది. నిజానికి ఇదొక్కటే కాదు, మహేష్ కోసం 5 కథలు రెడీగా ఉన్నాయి. ఈ కథల్ని తయారుచేయడం కోసం రాజమౌళి, ప్రత్యేకంగా ఓ టీమ్ ను ఏర్పాటుచేశాడనే విషయాన్ని మనం ఇదివరకే […]

Advertisement
Update:2021-02-14 10:22 IST

మహేష్-రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న సినిమాపై రోజుకో పుకారు షికారు చేస్తోంది. ఇందులో
భాగంగా తాజాగా మరో రూమర్ బయటకొచ్చింది. మహేష్ కోసం రాజమౌళి, ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ స్టోరీ రెడీ
చేశాడట. ఇండియానా జోన్స్ సిరీస్ తరహాలో ఈ సినిమా ఉంటుందనే ప్రచారం మొదలైంది.

నిజానికి ఇదొక్కటే కాదు, మహేష్ కోసం 5 కథలు రెడీగా ఉన్నాయి. ఈ కథల్ని తయారుచేయడం కోసం
రాజమౌళి, ప్రత్యేకంగా ఓ టీమ్ ను ఏర్పాటుచేశాడనే విషయాన్ని మనం ఇదివరకే చెప్పుకున్నాం. ఇప్పుడా
టీమ్ తయారుచేసిన కథల్లో అటవీ నేపథ్యంలో సాగే కథ కూడా ఉంది.

అయితే ఇంతకుముందే చెప్పుకున్నట్టు, ఈ కథే ఫైనల్ అని చెప్పడానికి వీల్లేదు. ఆర్ఆర్ఆర్ సినిమా
థియేటర్లలోకి వచ్చేలోపు మహేష్ మూవీకి సంబంధించిన కథను ఫిక్స్ చేయాలనేది రాజమౌళి టార్గెట్.
అందుకే కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా ఓవైపు ఆర్ఆర్ఆర్ పూర్తిచేస్తూనే, మరోవైపు మహేష్ కథపై
కూర్చుంటున్నాడు. అక్టోబర్ 13న ఆర్ఆర్ఆర్ థియేటర్లలోకి రానుంది. ఆ వెంటనే మహేష్-రాజమౌళి
సినిమాకు సంబంధించి ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Tags:    
Advertisement

Similar News