మహేష్ సినిమా లీకుల వర్షం
ఓ పెద్ద హీరో సినిమా సెట్స్ పై ఉందంటే ఆ సినిమా వర్కింగ్ స్టిల్స్ లీక్ అవ్వకుండా ఆపడం ఎవ్వరి తరం కావట్లేదు. టెక్నాలజీ బాగా పెరిగిపోవడంతో పెద్ద హీరోల షూటింగ్ విజువల్స్ ఆటోమేటిగ్గా లీక్ అయిపోతున్నాయి. మొన్నటివరకు పుష్ప సినిమా ఇలా లీకులతో బాధపడింది. ఇప్పుడు మహేష్ బాబు సినిమా వంతు వచ్చింది. సర్కారువారి పాట సినిమా చేస్తున్నాడు మహేష్. ఈ సినిమా షూటింగ్ దుబాయ్ లోని ఎడారిలో జరుగుతోంది. ఎడారిలో షూటింగ్ జరుగుతున్నప్పటికీ లీకులు […]
ఓ పెద్ద హీరో సినిమా సెట్స్ పై ఉందంటే ఆ సినిమా వర్కింగ్ స్టిల్స్ లీక్ అవ్వకుండా ఆపడం ఎవ్వరి
తరం కావట్లేదు. టెక్నాలజీ బాగా పెరిగిపోవడంతో పెద్ద హీరోల షూటింగ్ విజువల్స్ ఆటోమేటిగ్గా లీక్
అయిపోతున్నాయి. మొన్నటివరకు పుష్ప సినిమా ఇలా లీకులతో బాధపడింది. ఇప్పుడు మహేష్ బాబు
సినిమా వంతు వచ్చింది.
సర్కారువారి పాట సినిమా చేస్తున్నాడు మహేష్. ఈ సినిమా షూటింగ్ దుబాయ్ లోని ఎడారిలో
జరుగుతోంది. ఎడారిలో షూటింగ్ జరుగుతున్నప్పటికీ లీకులు వదల్లేదు. మహేష్ చేస్తున్న ఫైట్స్, అక్కడి
వాహనాలు, సెట్ ప్రాపర్టీ.. ఇలా ప్రతిది సోషల్ మీడియాలోకి వచ్చేస్తోంది.
మహేశ్-కీర్తిసురేష్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు పరశురామ్ దర్శకుడు. మైత్రీ మూవీ
మేకర్స్, 14 రీల్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది
సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రానుంది సర్కారువారి పాట.