సొంత ఊరిలోనే అచ్చన్నకు షాక్​..!

ఏపీలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో పలు ఆసక్తికరమైన వ్యవహారాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించడం ప్రభుత్వానికి ఇష్టం లేదు. వ్యాక్సినేషన్​ ప్రక్రియకు ఆటంకం ఏర్పడుతుందని ప్రభుత్వం వాదిస్తున్నది. అయినప్పటికీ ఎన్నికల కమిషన్​ ఎన్నికల నిర్వహణకే మొగ్గుచూపింది. అయితే పెద్ద ఎత్తున ఏకగ్రీవాలు చేయాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు ఏకగ్రీవాలు చేసుకొనే గ్రామాలకు నజరానాలు ఉండే విషయం తెలిసిందే. అయితే ఏకగ్రీవాలపై అధికార టీడీపీ అడ్డు చెబుతూ వస్తున్నది. ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నదని టీడీపీ ఆరోపిస్తున్నది. ఎన్నికల కమిషనర్​ […]

Advertisement
Update:2021-02-01 10:36 IST

ఏపీలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో పలు ఆసక్తికరమైన వ్యవహారాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించడం ప్రభుత్వానికి ఇష్టం లేదు. వ్యాక్సినేషన్​ ప్రక్రియకు ఆటంకం ఏర్పడుతుందని ప్రభుత్వం వాదిస్తున్నది. అయినప్పటికీ ఎన్నికల కమిషన్​ ఎన్నికల నిర్వహణకే మొగ్గుచూపింది. అయితే పెద్ద ఎత్తున ఏకగ్రీవాలు చేయాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు ఏకగ్రీవాలు చేసుకొనే గ్రామాలకు నజరానాలు ఉండే విషయం తెలిసిందే. అయితే ఏకగ్రీవాలపై అధికార టీడీపీ అడ్డు చెబుతూ వస్తున్నది. ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నదని టీడీపీ ఆరోపిస్తున్నది. ఎన్నికల కమిషనర్​ కూడా బలవంతపు ఏకగ్రీవాలను ఆపుతానంటూ జిల్లా పర్యటనలకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో ఇప్పుడో ఆసక్తికర అంశం వెలుగుచేసింది.

ఏకంగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు సొంత అచ్చెన్నాయుడు సొంత గ్రామంలోనే ఏకగ్రీవంపై వివాదం రేగింది. ఆశ్చర్యకరంగా ఈ గ్రామంలో ఎన్నిక ఏకగ్రీవం చేయాలని అచ్చెన్నాయుడు భావించారు. కానీ ఆయనకు చుక్కెదురైంది. ఆయన బంధువు వైసీపీ మద్దతుతో పోటీకి దిగారు. శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి నియోజకవర్గం నిమ్మాడ అచ్చెన్నాయుడు సొంత గ్రామం. సహజంగానే ఈ ఊరు టీడీపీకి కంచుకోట. ఇక్కడ అచ్చెన్నాయుడు కుటుంబం ఎంత చెబితే అంత నడుస్తుంది. కానీ ఈ సారి అచ్చెన్నకు షాక్​ తగిలింది.

ఇక్కడ అచ్చెన్నాయుడు మద్దతు దారుడిపై ఓ వ్యక్తి పోటీచేస్తున్నారు. దశాబ్దాలుగా అచ్చెన్నాయుడు కుటుంబం మాటే ఆ గ్రామంలో వేదవాక్కు. ఎర్రన్నాయుడు బతికున్న రోజుల్లోనూ ఆ కుటుంబం ఏం చెబితే అదే ఫైనల్. కానీ అటువంటి గ్రామంలో ఇప్పుడు పోటీ ఎదురుకావడం.. అచ్చెన్నకు మింగుడు పడటం లేదు.

ఈ గ్రామంలో ఇప్పటివరకు ఎవరూ అచ్చెన్నాయుడు కుటుంబానికి ఎదురుచెప్పి పోటీచేయలేదు. కానీ తొలిసారి ఓ వ్యక్తి పోటీ చేయడం ఆసక్తిని కలిగిస్తున్నది. నిమ్మాడ పంచాయతీకి అచ్చెన్నకు సమీప బంధువైన కింజరాపు అప్పన్న సర్పంచ్​ అభ్యర్థిగా నామినేషన్​ దాఖలు చేశారు. అప్పన్నకు వైసీపీ మద్దతు ఇస్తున్నది. ఇక్కడ అచ్చెన్నాయుడు సోదరుడు హరిప్రసాద్ కుమారుడు సురేష్ టీడీపీ మద్దతుతో బరిలో ఉన్నారు.

కింజరాపు అప్పన్న పోటీచేయడాన్ని అచ్చెన్నాయుడు వర్గీయులు సహించలేకపోతున్నారు. ఏకంగా అచ్చెన్నాయుడు ఆయనను పోటీనుంచి తప్పుకోవాలని కోరారు. అయినప్పటికీ ఆయన పోటీలో ఉన్నారు. ఈ పంచాయతీలో ఎవరు గెలిచినా ఎవరు ఓడినా.. అచ్చెన్నాయుడు సొంతగ్రామంలోనే అతడి మద్దతుదారుడిపై పోటీచేయడంతో ఆసక్తి నెలకొన్నది.

Tags:    
Advertisement

Similar News