నయాగరా జలపాతం... మువ్వన్నెల రెపరెపలు !

ఈసారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా కెనడాలోని నయాగరా జలపాతం వద్ద మన జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు. ప్రపంచ ప్రసిద్ధమైన ఈ పర్యాటక ప్రదేశంలో మన ఆగస్టు 15 వేడుకలను జరపటం ఇదే మొదటిసారి. నేటి సాయంత్రం వేళ ఇక్కడ మన జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. నయాగరా జలపాతం వద్దనే కాకుండా కెనడా, టొరొంటోలోని 553 మీటర్ల ఎత్తున్న సిఎన్ టవర్ పైన కూడా జెండా వందన కార్యక్రమం నిర్వహిస్తారు. టొరొంటోలోని భారతదేశపు కాన్సుల్ జనరల్ అపూర్వ […]

Advertisement
Update:2020-08-15 03:10 IST

ఈసారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా కెనడాలోని నయాగరా జలపాతం వద్ద మన జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు. ప్రపంచ ప్రసిద్ధమైన ఈ పర్యాటక ప్రదేశంలో మన ఆగస్టు 15 వేడుకలను జరపటం ఇదే మొదటిసారి.

నేటి సాయంత్రం వేళ ఇక్కడ మన జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. నయాగరా జలపాతం వద్దనే కాకుండా కెనడా, టొరొంటోలోని 553 మీటర్ల ఎత్తున్న సిఎన్ టవర్ పైన కూడా జెండా వందన కార్యక్రమం నిర్వహిస్తారు. టొరొంటోలోని భారతదేశపు కాన్సుల్ జనరల్ అపూర్వ శ్రీవాస్తవ ఈ విషయంపై స్పందిస్తూ… కెనడాలోని సుప్రసిద్ధమైన ప్రదేశాలు మన జెండాలోని మూడు రంగుల వెలుగులతో ప్రకాశించడం మనకు గర్వకారణమన్నారు

న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్… మూడు రాష్ట్రాల్లో పనిచేస్తున్న ది ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ వారు… న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ లో సైతం మొట్టమొదటిసారి మన జాతీయ జెండాని ఎగురవేయనున్నారు.

Tags:    
Advertisement

Similar News