మెగాస్టార్ టైటిల్ వెనక కథ
మహేష్ బాబును సూపర్ స్టార్ అంటారు. పవన్ కల్యాణ్ ను పవర్ స్టార్ అంటారు. నానిని నేచురల్ స్టార్, గోపీచంద్ ను మ్యాచో స్టార్ అని అంటుంటారు. అయితే వీళ్లకు ఈ టైటిల్స్ ఎవరు పెట్టారు, ఎప్పుడు పెట్టారనే విషయాల్ని మాత్రం ఎవ్వరూ కచ్చితంగా చెప్పలేరు. అదే విధంగా చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదు ఇచ్చింది ఎవరనే విషయం కూడా చాలామందికి తెలియదు. ఇప్పుడా విషయాన్ని బయటపెట్టారు నిర్మాత కేఎస్ రామారావు. చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదు […]
మహేష్ బాబును సూపర్ స్టార్ అంటారు. పవన్ కల్యాణ్ ను పవర్ స్టార్ అంటారు. నానిని నేచురల్ స్టార్, గోపీచంద్ ను మ్యాచో స్టార్ అని అంటుంటారు. అయితే వీళ్లకు ఈ టైటిల్స్ ఎవరు పెట్టారు, ఎప్పుడు పెట్టారనే విషయాల్ని మాత్రం ఎవ్వరూ కచ్చితంగా చెప్పలేరు. అదే విధంగా చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదు ఇచ్చింది ఎవరనే విషయం కూడా చాలామందికి తెలియదు. ఇప్పుడా విషయాన్ని బయటపెట్టారు నిర్మాత కేఎస్ రామారావు.
చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదు పెట్టింది తానేనని అంటున్నారు కేఎస్ రామారావు. చిరంజీవితో మరణమృదంగం అనే సినిమా చేస్తున్నప్పుడు.. అప్పటికే ఉన్న సుప్రీమ్ హీరో అనే బిరుదు కాకుండా, కొత్తగా ఉండేలా మరో బిరుదు తగిలించాలని అనుకున్నారట. దాని కోసం కొన్ని రోజుల పాటు సుదీర్ఘంగా ఆలోచించి, చివరికి మెగాస్టార్ అనే బిరుదు పెట్టారట కేఎస్ రామారావు.
అలా మరణ మృదంగం సినిమా నుంచి సుప్రీమ్ హీరో కాస్తా, మెగాస్టార్ గా మారిపోయారు. కేఎస్ రామారావు ఏ ముహూర్తాన ఆ బిరుదు పెట్టారో కానీ, అప్పట్నుంచి మెగాస్టార్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదు రావడం వెనక కథ ఇది.