జనసేనాని కొందరివాడుగా మిగిలిపోతున్నారా...?
అందరివాడు సినిమా తీశారు కానీ.. చిరంజీవి రాజకీయాల్లో కొందరివాడిగానే మిగిలిపోయారు. అన్నబాటలోనే పవన్ కల్యాణ్ ఇప్పుడు కొందరివాడిగా రూపాంతరం చెందుతున్నారు. సంకుచిత మనస్తత్వంతో, చంద్రబాబు హిడెన్ అజెండాతో పనిచేస్తున్న పవన్ కల్యాణ్ తన రాజకీయ భవిష్యత్తును తానే పాడుచేసుకుంటున్నట్టు స్పష్టమవుతోంది. ఏరికోరి తమ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుని మరీ పోటీచేసినప్పుడే పవన్ కల్యాణ్ ఏంటో చాలామందికి అర్థమైపోయింది. జగన్ అధికారంలోకి వచ్చాక కాపు రిజర్వషన్ల సంగతేంటని ప్రశ్నిస్తూ.. మీరిచ్చే కార్పొరేషన్ […]
అందరివాడు సినిమా తీశారు కానీ.. చిరంజీవి రాజకీయాల్లో కొందరివాడిగానే మిగిలిపోయారు. అన్నబాటలోనే పవన్ కల్యాణ్ ఇప్పుడు కొందరివాడిగా రూపాంతరం చెందుతున్నారు.
సంకుచిత మనస్తత్వంతో, చంద్రబాబు హిడెన్ అజెండాతో పనిచేస్తున్న పవన్ కల్యాణ్ తన రాజకీయ భవిష్యత్తును తానే పాడుచేసుకుంటున్నట్టు స్పష్టమవుతోంది. ఏరికోరి తమ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుని మరీ పోటీచేసినప్పుడే పవన్ కల్యాణ్ ఏంటో చాలామందికి అర్థమైపోయింది.
జగన్ అధికారంలోకి వచ్చాక కాపు రిజర్వషన్ల సంగతేంటని ప్రశ్నిస్తూ.. మీరిచ్చే కార్పొరేషన్ నిధులు మాకు సరిపోవు.. మాకు రిజర్వేషన్ కావాల్సిందేనంటూ గర్జిచినప్పుడు పవన్ మిగతా వర్గాల్లో మరింత పలుచన అయ్యారు.
ఇక ఇప్పుడు ప్రాంతాల వారీగా మరింతగా కుంచించుకుపోతున్నారు జనసేనాని. గాజువాకలో పవన్ కల్యాణ్ గెలిచి ఉంటే.. ఇప్పుడు కార్యనిర్వాహక రాజధానిగా విశాఖకు ఆయన అడ్డుపడేవారేనా? ఉత్తరాంధ్ర వెనకబాటు తనం గురించి ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన పవన్ కల్యాణ్ ఇప్పుడు అదే ప్రాంతానికి ఓ రాజధాని వస్తుంటే ఎందుకు అడ్డుకోవాలనుకుంటున్నారు. రాయలసీమ కష్టాల గురించి మాట్లాడిన జనసేనానికి న్యాయరాజధాని ఆ ప్రాంతానికి వస్తే కలిగే నష్టమేంటి? అమరావతి అమరావతి అని కలవరిస్తూ భ్రమల్లో ఉంటున్నారు పవన్ కల్యాణ్.
రాజీనామాల విషయంలో కూడా ఆ రెండు జిల్లాల వారిని టార్గెట్ చేసుకున్నారు పవన్ కల్యాణ్. అంటే ఆయనకు కృష్ణా, గుంటూరు జిల్లాలు మినహా మిగతా 11 జిల్లాలు ఆయనకు కనిపించలేదా? సినిమా టికెట్లు కొనడానికి అన్ని ప్రాంతాలవారు కావాలి, ఓట్లు వేయడానికి అన్ని ప్రాంతాల వారు అవసరం. కానీ రాజధాని మాత్రం ఆ రెండు జిల్లాలను దాటి బైటకు రాకూడదంటే.. అదెక్కడి న్యాయం? ఇంకెంతకాలం చంద్రబాబు సావాసం? ఇప్పటికైనా పవన్ కల్యాణ్ బాబు ఉచ్చులోనుంచి బైటపడి నిజాయితీగా జనం తరపున పోరాడితేనే జనసేనకు భవిష్యత్తు ఉంటుంది.
బాబు హిడెన్ అజెండాని అమలు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటే మాత్రం పవన్ కలలుగంటున్న పాతికేళ్ల రాజకీయ ప్రస్థానంలో కనీసం ఒక్క విజయం కూడా ఉండకపోవచ్చు.