"ఆర్ఆర్ఆర్" 70శాతం పూర్తయిందంట

ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న “ఆర్ఆర్ఆర్” సినిమా ఎంత పూర్తయిందనే విషయాన్ని రాజమౌళి కచ్చితంగా చెప్పలేకపోయాడు. ఇలాంటి పెద్ద సినిమాలకు పోస్ట్ ప్రొడక్షన్, గ్రాఫిక్స్, షూట్ అన్నీ మిక్స్ అయి ఉంటాయని.. ఎప్పటికప్పుడు సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంటుందని.. కాబట్టి ఎంత షూట్ కంప్లీట్ అయిందనే విషయం చెప్పలేమని అన్నాడు జక్కన్న. కానీ ఈ సినిమా షూటింగ్ 70శాతం కంప్లీట్ అయిందని ప్రకటించాడు సెంథిల్. “ఆర్ఆర్ఆర్”కు కెమెరామెన్ గా పనిచేస్తున్న సెంథిల్.. సినిమా షూటింగ్ 70శాతం […]

Advertisement
Update:2020-07-31 05:30 IST

ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న “ఆర్ఆర్ఆర్” సినిమా ఎంత పూర్తయిందనే విషయాన్ని రాజమౌళి కచ్చితంగా చెప్పలేకపోయాడు.

ఇలాంటి పెద్ద సినిమాలకు పోస్ట్ ప్రొడక్షన్, గ్రాఫిక్స్, షూట్ అన్నీ మిక్స్ అయి ఉంటాయని.. ఎప్పటికప్పుడు సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంటుందని.. కాబట్టి ఎంత షూట్ కంప్లీట్ అయిందనే విషయం చెప్పలేమని అన్నాడు జక్కన్న. కానీ ఈ సినిమా షూటింగ్ 70శాతం కంప్లీట్ అయిందని ప్రకటించాడు సెంథిల్.

“ఆర్ఆర్ఆర్”కు కెమెరామెన్ గా పనిచేస్తున్న సెంథిల్.. సినిమా షూటింగ్ 70శాతం పూర్తయిందని, సైమల్టేనియస్ గా ఎడిటింగ్-డబ్బింగ్ కూడా నడిచిందని అంటున్నాడు. కేవలం 30శాతం మాత్రమే షూటింగ్ ఉందంటున్నాడు సెంథిల్.

మరోవైపు టెస్ట్ షూట్ రద్దు చేయడంపై కూడా స్పందించాడు సెంథిల్. ప్రతి రోజూ 500 మందితో పని చేసేవాళ్లమని, అలాంటిది 40-50 మందితో పని చేయాల్సి రావడం కష్టంగా మారిందన్నాడు. అయినప్పటికీ ఓ 40 మందితో టెస్ట్ షూట్ చేయాలని రెడీ అయ్యామని, కానీ తమ వైపు నుంచి తప్పు జరగకూడదనే ఉద్దేశంతో, సామాజిక బాధ్యతగా టెస్ట్ షూట్ ను కాన్సిల్ చేశామంటున్నాడు.

“ఆర్ఆర్ఆర్” సెట్స్ పైకి రావడానికి మరో 2 నెలల టైమ్ పడుతుందంటున్నాడు సెంథిల్.

Tags:    
Advertisement

Similar News