ఇండియాలో గుర్తించని కోవిడ్ కేసులు 3 కోట్లు... రాబోయే 6 వారాల్లో 10 కోట్లకు చేరవచ్చు!
ఇండియాలో ప్రస్తుతం గుర్తించని కోవిడ్-19 కేసులు 3 కోట్ల వరకు ఉండొచ్చని.. రాబోయే 6 వారాల్లో ఈ సంఖ్య 10 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలోని అత్యంత ప్రముఖ అంటువ్యాధుల నిపుణురాలు, యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్‌లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోస్టాటస్టిక్స్ హెడ్ భ్రమర్ ముఖర్జీ ఈ విషయం తెలిపారు. ప్రముఖ జర్నలిస్ట్ కరణ్ థాపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు తెలిపారు. ఇటీవల వచ్చిన గణాంకాల ఆధారంగా విశ్లేషించడం ద్వారా ఇండియాలో ఎన్ని […]
ఇండియాలో ప్రస్తుతం గుర్తించని కోవిడ్-19 కేసులు 3 కోట్ల వరకు ఉండొచ్చని.. రాబోయే 6 వారాల్లో ఈ సంఖ్య 10 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలోని అత్యంత ప్రముఖ అంటువ్యాధుల నిపుణురాలు, యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్‌లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోస్టాటస్టిక్స్ హెడ్ భ్రమర్ ముఖర్జీ ఈ విషయం తెలిపారు. ప్రముఖ జర్నలిస్ట్ కరణ్ థాపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు తెలిపారు.
ఇటీవల వచ్చిన గణాంకాల ఆధారంగా విశ్లేషించడం ద్వారా ఇండియాలో ఎన్ని కేసులు ఉండవచ్చో అంచనా వేసినట్లు ఆమె తెలిపారు. ఇప్పటికే ఇండియాలో 3 కోట్ల కేసులు ఉండొచ్చని, ఇవి ప్రస్తుతం గుర్తించిన 13 లక్షల కేసులను కలిపే తేల్చామని ఆమె అన్నారు. రాబోయే రోజుల్లో ఎటువంటి లక్షణాలు లేని కోవిడ్-19 పేషెంట్లు మరో 2.8 కోట్ల మందికి చేరుకుంటారని ఆమె అన్నారు.
ఇండియాలో ఇప్పటికే సామూహిక వ్యాప్తి మొదలైందని, ఇందులో ఎంత మాత్రం అనుమానం లేదన్నారు. ఇప్పటికే కోవిడ్-19 రోగులకు వ్యాధి ఎవరి నుంచి సంక్రమించిందో గుర్తించలేకపోతున్నారని.. సామూహిక వ్యాప్తి అంటే ఇదేనని ఆమె స్పష్టం చేశారు. కానీ ప్రభుత్వ వైద్యులు, అధికారులను సామూహిక వ్యాప్తి లేదని చెప్పమని ఒత్తిడి చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఇండియాలో సామూహిక వ్యాప్తి లేదని శాస్త్రవేత్తలు ఎలా నిరూపిస్తారో చూడాలని ఆసక్తిగా ఉందని ఆమె అన్నారు.
భారత ఉపఖండంలో ఒకే సారి కేసులు పెరిగే అవకాశం ఉండదు. కానీ ఒక్కో ప్రాంతంలో ఒక్కోసారి వ్యాధి బారిన పడే వాళ్ల సంఖ్య అత్యధికంగా పెరుగూ ఉంటుంది. దేశవ్యాప్తంగా ఒకేసారి సంఖ్య పెరిగే అవకాశం లేదని ఆమె చెప్పారు. ఇండియాలో ఇప్పటికే 4 కోట్ల కోవిడ్ టెస్టులు చేయాల్సి ఉంది. కానీ అలా జరగలేదు. కానీ సాధ్యమైనంత వరకు ఎన్ని టెస్టులు చేయగలిగితే అన్ని చేస్తే మంచిది. కంటైన్మెంట్ జోన్లలో ఇంటింటికీ తిరిగి టెస్టులు చేయాల్సిన అవసరం ఉంది. ఇండియా జనాభాలో 1.2 శాతం మందికి మాత్రమే టెస్టులు చేశారు. అదే అమెరికాలో 14 శాతం, రష్యాలో 17 శాతం జనాభాకు పరీక్షలు నిర్వహించినట్లు ఆమె గుర్తు చేశారు.
కానీ ఢిల్లీ మాత్రం కరోనా విషయంలో విజయం సాధించినట్లే కనపడుతున్నది. గత జూన్ 29 నుంచి ఢిల్లీలో రీప్రొడక్షన్ రేటు 1గా ఉంది. కానీ ప్రస్తుతం అది 0.76కి తగ్గింది. ఇండియాలో మరణాల రేటు మిలియన్‌కి 23గా ఉన్నట్లు ఆమె చెప్పారు. కేవలం ఆరు వారాల అంచనాలు వేయడానికి ప్రతీ రోజు మారుతున్న కేసుల సంఖ్యే అని ఆమె అన్నారు. అమెరికాలోని ఎంఐటీ అంచనాల ప్రకారం వ్యాక్సిన్ రాకపోతే 2021లో ఇండియాలో ప్రతీ రోజు 2.5 లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ఆమె చెప్పారు.