కరోనా స్క్రీనింగ్ లో... స్మార్ట్ హెల్మెట్!

కరోనా నిర్దారిత పరీక్షలు సైతం పరీక్షగా మారుతున్న వేళ…  పదడుగుల దూరంలో ఉన్న వ్యక్తులను థర్మల్ స్ర్కీనింగ్ చేసి టెంపరేచర్ ని చెప్పగల సూపర్ స్మార్ట్ హెల్మెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఒకేసారి 13మందిని స్క్రీనింగ్ చేయగల సామర్ధ్యం సైతం వీటికి ఉంది. బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ తో కలిసి భారతీయ జైన్ సంఘటన వాలంటీర్లు వీటిని వినియోగిస్తున్నారు. చేతికి పెట్టుకునే ఒక వాచీ ద్వారా ఈ హెల్మెట్ ని ఆపరేట్ చేస్తారు. స్మార్ట్ హెల్మెట్ లో […]

Advertisement
Update:2020-07-24 12:46 IST

కరోనా నిర్దారిత పరీక్షలు సైతం పరీక్షగా మారుతున్న వేళ… పదడుగుల దూరంలో ఉన్న వ్యక్తులను థర్మల్ స్ర్కీనింగ్ చేసి టెంపరేచర్ ని చెప్పగల సూపర్ స్మార్ట్ హెల్మెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఒకేసారి 13మందిని స్క్రీనింగ్ చేయగల సామర్ధ్యం సైతం వీటికి ఉంది. బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ తో కలిసి భారతీయ జైన్ సంఘటన వాలంటీర్లు వీటిని వినియోగిస్తున్నారు.

చేతికి పెట్టుకునే ఒక వాచీ ద్వారా ఈ హెల్మెట్ ని ఆపరేట్ చేస్తారు. స్మార్ట్ హెల్మెట్ లో ధర్మల్ కెమెరాలు ఉంటాయని వీటి ద్వారా ఒకేసారి ఎక్కువమందిని స్క్రీనింగ్ చేసే అవకాశం ఉంటుందని, ఇంతకుముందు ఇందుకోసం థర్మల్ గన్ ని వాడామని భారతీయ జైన్ సంఘటన వాలంటీర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నీలూ జైన్ అన్నారు. థర్మల్ గన్ ద్వారా గంటకు 200 నుండి 300 మందిని స్క్రీన్ చేసే అవకాశం ఉండగా… ఇప్పుడు స్మార్ట్ హెల్మెట్ ద్వారా గంటకు ఐదువేలమందికి స్క్రీనింగ్ నిర్వహించవచ్చు.

పదడుగుల దూరం నుండి స్క్రీన్ చేసే అవకాశం ఉండటం వలన ఈ హెల్మెట్ తో స్క్రీనింగ్ నిర్వహించే వారు సురక్షితంగా ఉండవచ్చని భారతీయ జైన్ సంఘటన తరపున పనిచేస్తున్న వైద్యులు అంటున్నారు. రెండువారాలుగా స్మార్ట్ హెల్మెట్ ద్వారా 17వేలమందికి స్క్రీనింగ్ నిర్వహించామని, ఎక్కువ టెంపరేచర్ ఉన్నవారిని కోవిడ్ 19 నిర్దారణ పరీక్షలకు పంపుతున్నామని వారు వెల్లడించారు. మహారాష్ట్రలో స్మార్ట్ హెల్మెట్లు నాలుగు ఉన్నాయి. రెండు ముంబయిలో ఉండగా రెండు పుణెలో ఉన్నాయి.

Tags:    
Advertisement

Similar News